Thursday, 13 February 2014

నేను  గ్రూప్ 1  ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు..నాతోపాటు వెయిటింగ్ హాల్లో ఇద్దరు ఆంధ్ర (అప్పటికి తెలంగాణ రాలేదు) నుండి వచ్చిన క్రిస్టియన్ అమ్మాయిలు కూర్చున్నారు. బైబిల్ పట్టుకుని ...కాసేపు ప్రార్ధన చేసుకున్నారు..తర్వాత  ఒకమ్మాయి బైబిల్ దాచేసి.. హాండ్ బ్యాగ్లో నుండి బొట్టుబిల్లలు తీసి  పెట్టుకుని ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళింది.ఇంకో అమ్మాయిని నేను అడిగాను ...ఎందుకలా అని..మేము ఇంటర్వ్యూలో హిందు అనే చెప్పాలి , లేకుంటే sc reservation రాదు అని. నా కళ్ళ ముందే జరిగింది.
Johnson Choragudi :
National Commission for Religious and Linguistic Minorities, also called as Ranganath Misra Commission was constituted by Government of India on 29 October 2004 to look into various issues related to Linguistic and Religious minorities in India. It was chaired by former Chief Justice of India Justice Ranganath Misra. The commission submitted the report to the Government on 21 May 2007.ఇది అమలు జరిగి వుంటే, మీరు ఇంటర్వు బోర్డ్ వద్ద చూసిన  ఆ ఇద్దరి ఇక్కట్లు తప్పేవి. కానీ జరగలేదు.ఇది ఆగింది ఎక్కడ అంటే, కులము - విశ్వాసం వేర్వేరు, అని ఒక ముగింపుకు కమీషన్  వచ్చింది. ఈ దశలో సమస్యకు పరిష్కారం దొరకాలి. ఎందుకంటే దానికి అప్పగించిన పనిలో SC reservation to Dalit converts అంశం కూడా ఒకటి. నిజానికి ఆ దశలో దళితులకు ఎస్సీ హోదా రావాలి. కానీ అది జరగలేదు. సరిగ్గా  ఇక్కడే, అప్పటి కమీషన్ రిపోర్ట్సతోె పాటుగా ఆ కమీషన్ సెక్రటరీ దాన్ని నియమించిన హోం శాఖకు ఒక 'డిస్సేంట్ నోట్' కూడా రాసింది. ఆమె అన్నది - 'విశ్వాసం' అంటే ఏమిటో భారతీయ 'చర్చి' నిర్వచించాలి, అని. ఎందుకంటే - అప్పటికి అక్కడ పార్టీ - చర్చి కి వెళ్ళే క్రైస్తవులు కనుక. అయితే, అది ఇప్పటివరకు జరగలేదు. 'చర్చి' ఆ పని ఎప్పటికీ చేయదు. కారణం నిజమైన 'విశ్వాసి' కి చర్చి వంటి (స్ట్రక్చర్ - నిర్మాణం) బిల్డింగు తో పనిలేదు. ఆ సత్యం ఓపెన్ గా  ఒప్పుకుంటే, చర్చికి ఇక మనుగడ లేదు. దాంతో ఇదొక పరిష్కారం లేని సమస్యగా మారింది!!