(బాబాసాహెబ్ రచనలు ప్రసంఘాలు - సంపుటం 5, భాగం 4)
🔹 పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 569, 570, 571 🔹
విద్య, వైద్యం కార్యక్రమాల మీద, క్రైస్తవ మిషనరీలు ఖర్చుపెట్టిన సొమ్ము, చేసిన కృషి మొత్తము దుర్వినియోగం మరియు భారతీయ క్రైస్తవులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
భారతీయ క్రైస్తవుల రెండు నిజమైన అవసరాలు
- మొదటిది వారి, పౌర స్వచ్ఛను కాపాడుకోవడం...
- రెండవది వారి ఆర్ధిక వికాసానికి కావలసిన మార్గాలు, వనరులు..
- మొదటిది వారి, పౌర స్వచ్ఛను కాపాడుకోవడం...
- రెండవది వారి ఆర్ధిక వికాసానికి కావలసిన మార్గాలు, వనరులు..
ఈ అవసరాలను వివరణాత్మకంగా చర్చించకుండా, నన్ను నేను నిగ్రహించుకోలేను. అసలు క్రైస్తవ మిషినరీల సామాజిక కార్యక్రమాల్లో తప్పకుండా ఉండాల్సిన అవశ్యకతలేమిటో చెప్పాలనేది నా ఉద్దేశం.
క్రైస్తవ మిషనరీలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు
- క్రైస్తవంలోకి మారిన వ్యక్తియొక్క మనస్తత్వాన్ని మార్చడంలో క్రైస్తవం సాధించింది ఏమిటి..??
- (క్రైస్తవం ద్వారా) అస్పృష్య క్రైస్తవుడు, సవర్ణ హిందువు స్థాయికి చేర్చబడ్డాడా...??
- అస్పృష్య క్రైస్తవుడు, సవర్ణ క్రైస్తవుడు క్రైస్తవం స్వీకరించాక తమ కులాలను వదులుకున్నారా.....??
- వారు ముందు పాటించిన మతాల దేవుళ్లను ఆరాధించడం, మతాచారాలను పాటించడం మానివేశారా ..??
- క్రైస్తవంలోకి మారిన వ్యక్తియొక్క మనస్తత్వాన్ని మార్చడంలో క్రైస్తవం సాధించింది ఏమిటి..??
- (క్రైస్తవం ద్వారా) అస్పృష్య క్రైస్తవుడు, సవర్ణ హిందువు స్థాయికి చేర్చబడ్డాడా...??
- అస్పృష్య క్రైస్తవుడు, సవర్ణ క్రైస్తవుడు క్రైస్తవం స్వీకరించాక తమ కులాలను వదులుకున్నారా.....??
- వారు ముందు పాటించిన మతాల దేవుళ్లను ఆరాధించడం, మతాచారాలను పాటించడం మానివేశారా ..??
ఈ ప్రశ్నలకు క్రైస్తవం నుండి వచ్చే సమాధానాల మీదనే, క్రైస్తవము భారతదేశంలో కొనసాగబోవడమా లేక దెబ్బతింటామా అనే విషయం ఆధారపడి ఉంది..
సైమన్ కమిషన్ పర్యటన సందర్బంగా దక్షిణ భారతదేశ క్రైస్తవ వర్గాలు, వారి సామాజిక స్థితిగతుల మీద కుల సమస్య మీద సమర్పించిన వినతి పత్రంలోని ఈ సమాచారం, క్రైస్తవ మతంలోకి మారిన దళితుల స్థితిగతుల గురించి మరింత వివరంగా తెలుపుతుంది..
-*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*-
మతపరంగా మేము క్యాథలిక్కులమైనా, ప్రొటెస్టెంట్లము అయినా క్రైస్తవులము. ప్రెసిడెన్సీ పాలనలో ఉన్న భూభాగంలో నివసిస్తూ మతం మారినవాళ్ళలో 60% మంది అంటరాని కులాల నుండి వచ్చినవారే. మా భూభాగంలో ఎప్పుడైతే క్రైస్తవం ప్రకటింపబడిందో, అప్పటి నుండి, మేము ముఖ్యంగా, పల్లాలు, పరియాలు, మాలలు, మాదిగలు క్రైస్తవాన్ని ఆచరిస్తున్నవాళ్ళం. మా సంబంధికుల్లో ఎవరైతే ఇప్పటికి హిందూమతంలో భాగస్థులుగా ఉన్నారో వారు క్రైస్తవ మతంలోకి మారలేదు. ఏదేమైనా మేమే క్రైస్తవమతంలో మారినప్పటికీ, క్రైస్తవ ప్రధాన బోధనలైన దైవం ముందు అందరూ సమానమే, సాటి మనిషి పట్ల కారుణ్యాన్ని కలిగి ఉండడం, క్షమాగుణం, సానుభూతి కలిగి ఉండడం లాంటివి పాటిస్తున్నప్పటికీ మా జీవన పరిస్థితులు, మతం మారని హిందూ అంటరాని ప్రజల జీవన స్థితిగతులు ఒకేరకంగా ఉన్నాయి.
అనేక కారణాలు ఉన్నప్పటికీ, అన్నింటికంటే ముఖ్యమైన, మతమ్మారిన క్రైస్తవుల్లో కూడా పాతుకుపోయిన, కులాన్ని వదులుకోలేని హిందూ స్వభావం (Caste retaining Hindu Mentality) వలన, ఈ స్వభావం పట్ల క్రైస్తవ మత సంస్థల ఉదాసీనత వలన, మతం మారకముందు ఏ విధమైన స్థితిగతులు అనుభవించామో, ఇప్పుడూ అదే స్థాయిలో కొనసాగుతున్నాము. అంటరాని వారిగానే తోటి అగ్రకుల క్రైస్తవులచేత, అగ్రకుల హిందువుల చేత తిరస్కరించబడుతున్నాం. మరోవైపు ఏ సమాజికవర్గ పునాదుల నుండి వచ్చామో ఆ హిందూ అస్పృష్య సోదరుల నుండి కూడా వేరు చేయబడ్డాం.
దక్షిణ భారతదేశంలో మద్రాసులాంటి రాష్ట్రాల్లో చట్టసభల్లో క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతికొద్ది మంది కూడా అగ్రకుల క్రైస్తవులే. ఇది చాలా వైరుధ్యంగా కనిపించినప్పటికీ వంద శాతం వాస్తవం. హిందూ మతం నుండి వచ్చిన అగ్రకుల క్రైస్తవులు తమ తమ కులాల పోకడలను యధాతధంగా కొనసాగిస్తున్న వారే. వారు ఒకవైపు క్రైస్తవ మతాచారాలను పాటిస్తూ, సోదర క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కులవివక్షను, చాందస తీవ్రతను అవలంభిస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని "పంచములు లేదా పరియాలు" అని హేళన చేస్తూనే ఉన్నారు. తమకున్న ధనం, అధికారం, హోదాగర్వం, పదవులు లాంటి వాటి సహాయంతో అస్పృష్య క్రైస్తవులను మరింత వివక్షతకు గురి చేయడం వారికి పరిపాటిగా మారింది. వారు తరచుగా క్రైస్తవ జీవితంలోనే పంచమ వ్యతిరేక కార్యకలాపాలను యాదేచ్ఛగా పాల్పడే సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.
మా జీవితాలను బాగుచేసుకునేందుకు, మా పురోగతికోసం, ప్రాథమిక హక్కుల కోసం మేము చేసే ఏ ప్రయత్నం అయినా కూడా, జన్మతః అధికులము అని భావించే అగ్రకుల క్రైస్తవుల, హిందువుల ఈసడింపుకు గురికాబడుతోంది. క్రైస్తవ మౌలిక సూత్రాలైన విశ్వప్రేమ, సమానత్వం, కారుణ్యవాదానికి భిన్నంగా, "మా సోదర క్రైస్తవులు అని చెప్పబడుతున్నవారు" మమ్మల్ని నేటికీ చర్చీల్లో అంతరానివాళ్ళుగా, దగ్గరకు రానివ్వకూడని సముదాయాలుగానే పరిగణిస్తున్నారు. ప్రార్ధనా స్థలాలలో, చర్చీలలో ఇనుప బ్యారికేడ్లతో, ఫెన్సింగ్ మరియు వేర్వేరు రూపాలలో అడ్డుగోడలు నిర్మించి కొనసాగిస్తున్న సందర్భాలు అనేకం.
కలుషితం అనే నెపంతో మతకర్మలు పాటించే విషయంలో కూడా ఘోరమైన విభాజిత దృష్టి పాటించబడుతున్నది. క్రైస్తవ విద్యా సంస్థల ద్వారా మా పిల్లలను విద్యావంతులను చేసి, వారికి మంచి జీవితం అందించాలన్న మా తలంపు కూడా నిర్ధాక్షిణ్యంగా నిరాదరించబడుతున్నది... విద్యాసంస్థల్లో, హాస్టళ్లలో అనుమతి నిరాకరించబడుతున్నది. ఒకవేళ అనుమతి అందిన కూడా, అగ్రకుల క్రైస్తవులకు ప్రత్యేక వసతులు, అంటరాని కులాల క్రైస్తవులకు హీనమైన వసతులు ఇస్తూ వివక్షత చూపించడం సాధారణ అంశంగా మారింది.
తమ పూర్వపు హిందూ అగ్రకుల సారాన్ని తమలో ఇముడ్చుకుని, క్రైస్తవంలో కూడా తమకు ప్రత్యేక సామాజిక హోదా ఏర్పరచుకొని, హిందూ మతంలో ఉన్న తమ బంధువులతో సమానంగా పరిగణనలోకి రావాలని, క్రైస్తవములో ఉన్నప్పటికీ అంటరాని కులాల క్రైస్తవులకు, వీళ్ళు చిన్నచూపు చూస్తారు..
-*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*-
క్రైస్తవంలో ఈ రకమైన వివక్షా స్థితి అత్యంత దారుణమైనది...
🔹 పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 572, 573 🔹
మొత్తంగా, క్రైస్తవ మతలోకి మారినవారిలో కులదృష్టి తీసివేయడంలో క్రైస్తవ మతం విజయం సాధించలేకపోయింది. హిందువుల జీవితాలను ఈ మాదిరిగానైతే కులమే నియంత్రిస్తుందో, క్రైస్తవ జీవితాలను కూడా కులమే శాసిస్తోందని చెప్పడంలో నాకు ఏ దురుద్దేశము లేదు. క్రైస్తవ మతానికి మారినవాళ్ళలో బ్రాహ్మణ క్రైస్తవులు ఉన్నారు, బ్రాహ్మణేతర క్రైస్తవులు ఉన్నారు, బ్రహ్మణేతర క్రైస్తవుల్లో మళ్లీ, మరాఠా క్రైస్తవులు, మహార్ క్రైస్తవులు, మాంగ్ క్రైస్తవులు, భంగి క్రైస్తవులు, మాల క్రైస్తవులు, మాదిగ క్రైస్తవులు అని అనేక కులాలుగా ఉన్నారు. వీరిలో సహపంక్తి భోజనాలు ఉండవు. వివాహ బాంధవ్యాలను ఏర్పరుచుకోవడానికి ఇష్టపడరు. హిందువులలాగానే వీళ్ళు కూడా కుల పోకడలతో కొట్టుమిట్టాడుతున్నవారే.
క్రైస్తవ మతమార్పిడులు, క్రైస్తవం సఫలం కాకపోవడానికి కారణం మరొక విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. మత మార్పిడి చెందినప్పటికీ క్రైస్తవులు రకరకాల రూపాల్లో, పేర్లతో తమ పూర్వపు హిందూ సాంప్రదాయాలను, మూఢ విశ్వాసాలను పాటిస్తూ ఉండడం స్పష్టంగా చూడవచ్చు. చాలామంది వారి కుటుంబ దేవతతో పాటు, రాముడు కృష్ణుడు, విష్ణువు, శంకరుల అవతారాలను పూజిస్తూ కనిపిస్తారు. హిందూ పవిత్ర స్థలాలకు విహారాయాత్రల పేరుతో వెళ్లివస్తూ ఉంటారు. గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూడడానికి భయపడతారు. గ్రహణం రోజు సముద్రస్నానం చేయడం లాంటి ఆచారాలనూ పాటిస్తారు. ముహూర్తాలను, జాతకాలను నమ్ముతారు. దీపావళి, హోళీ లాంటి పండుగలను అందరితో కలిసి సంబరంగా జరుపుకుంటారు. ఇవన్నీ సమాజ సాంప్రదాయాలైతే ఇబ్బంది ఏమీ లేదుగానీ, ఇవ్వన్నీ హిందూ స్వభావంతో, మత ప్రభావం కోసం పాటించబడేవి. క్రైస్తవానికి మారినా కూడా వారిలో ఇంకా ఇలా హిందూ సాంప్రదాయాలు కొనసాగింపు చాలా దారుణమైన విషయం. ఈ సాంప్రదాయాలు నుండి క్రైస్తవం కూడా బయటపడలేకపోయింది.
క్రైస్తవంలోకీ మందిని మార్చాలనే తాపత్రయం మాత్రమే ఉన్న మిషనరీలు, ఈ హిందుత్వ సాంప్రదాయాలను, వాటి ప్రభావాన్ని తొలగించే ప్రయత్నం చేయకపోగా,, వాటిని సహిస్తూ, వాటిని ప్రోత్సహిస్తూ వచ్చారు.
🔹 పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 578, 579 🔹
క్రైస్తవ మత వ్యాప్తిని సరళతరం చేసి, తేలికగా మతమార్పిడులు చేయడానికి, హిందూ మతలో సున్నితమైన అంశాలకు భంగం కలిగించకుండా, హిందుత్వ మత ధోరనులెన్నింటినో కొనసాగించడాన్నీ, మిషనరీలు అలవాటు చేసుకున్నాయి.
అపరిమితమైన ఇలాంటి మినహాయింపులు లోబడి నామమాత్రంగా చేసే మతమార్పిడులు, సిగ్గుమాలినవే కాక, పాపాత్మకమైనవి కూడా. మతం మార్పిడి పొందిన వ్యక్తి యొక్క గత జీవన పరిస్తితులలు, ఆలోచనా ధోరణితో సంబంధం లేకుండా, హడావిడిగా కేవలం యేసును రక్షకుడిగా ప్రకటించేసి, క్రైస్తవీకరించడం సరైనది కాదు
No comments:
Post a Comment