ముంబై: మహారాష్ట్రలోని ప్రవర నదిపై ఉన్న నీల్‌వాండే డ్యామ్ కాలువల నిర్మాణం కోసం షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాలువల నిర్మాణం వల్ల అహ్మద్‌నగర్ జిల్లాతోపాటు నాసిక్ సిన్నార్‌లోని సంగమ్‌నెర్, అకోలె, రహత, రాహురి, కోపర్గో తహశీల్‌లలోని 182 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పిన ఆయన వడ్డీ మాత్రం వసూలు చేయబోమన్నారు. అయితే, ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. సామాజిక కార్యక్రమాల కోసం డబ్బులు వెచ్చించడం ఆలయ ట్రస్ట్‌కు కొత్త కాదని, అయితే, నీల్‌వాండే డ్యామ్ కోసం ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇదే తొలిసారిని, ఇది చాలా అరుదైన ఘటన అని ఆయన వివరించారు.
No comments:
Post a Comment