Dear Mr. Alexander
Allow me to say that the British have a moral responsibility towards the Scheduled Castes. They may have moral responsibilities towards all minorities. But it can never transcend the moral responsibility which rests on them in respect of the Untouchables. It is a pity how few Britishers are aware of it and how fewer are prepared to discharge it. British Rule in India owes its very existence to the help rendered by the Untouchables. Many Britishers think that India was conquered by the Clives, Hastings, Cootes and so on. Nothing can be a greater mistake. India was conquered by an army of Indians and the Indians who formed the army were all Untouchables. British Rule in India would have been impossible if the Untouchables had not helped the British to conquer India. Take the Battle of Plassey which laid the beginning of British Rule or the battle of Kirkee which completed the conquest of India. In both these fateful battles the soldiers who fought frthe British were all Untouchables
What have the British done to these Untouchables who fought for them ? It is a shameful story. The first thing they did was to stop their recruitment in the army. A more unkind, more ungrateful and more cruel act can hardly be found in history. In shutting out the Untouchables from the Army the British took no note that the Untouchables had helped them to establish their rule and had defended it when it was menaced by a powerful combination of native forces in the Mutiny of 1857. Without any consideration as to its effects upon the Untouchables the British by one stroke of the pen deprived them of their source of livelihood and let them fall to their original depth of degradation. Did the British help them in any way to overcome their social disabilities ? The answer again must be in the negative. The schools, wells and public places were closed to the Untouchables. It was the duty of the British to see the Untouchables, as citizens, were entitled to be admitted to all institutions maintained out of public funds. But the British did nothing of the kind and what is worst, they justified their inaction by saying that untouchability was not their creation. It may be that untouchability was not the creation of the British. But as Government of the day, surely the removal of untouchability was their responsibility. No Government with any sense of the functions and duties of a Government could have avoided it What did the British Government do ? They refused to touch any question which involved any kind of reform of Hindu society. So far as social reform was concerned, the Untouchables found themselves under a Government distinguished in no vital respect from those native Governments under which they had toiled and suffered, lived and died, through all their weary and forgotten history. From a political standpoint, the change was nominal. The despotism of the Hindus continued as ever before. Far from being curbed by the British High Command, it was pampered. From a social point of view, the British accepted the arrangements as they found them and preserved them faithfully in the manner of the Chinese tailor who, when given an old coat as a pattern, produced with pride an exact replica, rents and patches and all. And what is the result ? The result is that though 200 years have elapsed since the establishment of the British Rule in India the Untouchables have remained Untouchables, their wrongs remained unredressed and their progress hampered at every stage. Indeed if the British Rule has achieved anything in India it is to strengthen and reinvigorate Brahmanism which is the inveterate enemy of the Untouchables and which is the parent of all the ills from which the Untouchables have been suffering for ages.
Ref : The letter is reproduced in Dr babasaheb ambedkar writings and speeches volume 10,
pp 492-499
**************************************
1946 ఆల్బర్ట్ విక్టర్ అలెగ్జాండర్‌కు రాజ్యాంగ రక్షణలు అస్పృశ్యులకు ఎంత అవసరమో వివరిస్తూ అంబేద్కర్‌గారు వ్రాసిన లేఖ.
బ్రిటిష్ ప్రభుత్వం నుండి పాలనాధికారాన్ని భారతీయ నాయకత్వానికి బదిలీచేసే విషయమై చర్చించేందుకు 1946లో క్యాబినెట్ మిషన్ (దౌత్యవర్గం) భారతదేశం వచ్చింది. దాని సభ్యుడైన ఆల్బర్ట్ విక్టర్ అలెగ్జాండర్‌కు రాజ్యాంగ రక్షణలు అస్పృశ్యులకు ఎంత అవసరమో వివరిస్తూ అంబేద్కర్‌గారు వ్రాసిన లేఖ.
ప్రియమైన శ్రీ అలెగ్జాండర్,
కాంగ్రెస్‌కు, లీగ్‌కు మధ్య పరిష్కారం సాధించేందుకు మీరు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం విచారకరం. మీకు సానుభూతి, కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అయితే మిషన్ చేసిన ప్రయత్నాలు నాకో పాత కథను గుర్తుకు తెచ్చాయి. ఒక ముసలి వ్యాపారికి పిల్లలు లేరు. తన ఆస్తికి వారసుడు లేకపోవడంతో ఆయన ఒక యువతిని పెళ్ళి చేసుకున్నాడు. సంతానం కావాలనే ఆశ తీరబోతున్నట్లు తెలిసిందిగానీ ఆ వ్యాపారి ప్రాణాంతకమైన వ్యాధితో మంచమెక్కాడు. కొడుకును చూసేంతవరకు చనిపోకూడదని నిర్ణయించుకున్నాడు. కాని, ఆమె ప్రసవానికి ఇంకా చాలాకాలం పడుతుంది. ఎంత అసహనానికి గురయ్యాడంటే, డాక్టర్‌ను పిలిచి ఆమె కడుపు కోసి, శిశువు ఆడో, మగో చెప్పమని కోరాడు. చివరికి జరిగించేమిటంటే, ఆపరేషన్‌లో తల్లీ బిడ్డా చనిపోయారు. ఆ వ్యాపారి చేసిన పనే ఈ మిషన్ కూడా చేసినట్లనిపిస్తున్నది. మీకు తెలియకపోవచ్చును గాని సహజమైన ఫలన కాలం వరకు ఆగకుండా మీ మిషన్ ఇటువంటి బలవంతపు ప్రసవానికే పాటు పడిందని నాలాగే చాలామంది భావిస్తున్నారు.
ఈనాడు హిందువులకు, ముస్లింలకు ఈ దేశ గమ్యాన్ని నిర్ణయించేందుకు తగిన మానసిక పరిపక్వత లేదనిపిస్తున్నది. హిందువులు, ముస్లింలు కేవలం గుంపులు మాత్రమే. కంటికి కనిపించే ప్రయోజనం కంటే అందరూ పంచుకునే అనుభూతి వైపే గుంపులు మొగ్గు చూపుతాయనే సంగతి మీ అనుభవంలో తెలుసుకునే ఉంటారు. ఒక గుంపును తాపీగా ప్రయోజనాల గురించి అంచనా వేసుకోవలసిందిగా సూచించడం కంటే, సామూహిక త్యాగం చేయవససిందిగా నచ్చ చెప్పడం ఎంతో సులభం. లాభనష్టాల వివక్షను సమూహం ఎప్పుడూ కోల్పోతుంది. ఉన్నతమైన కారణాలకో, అల్పమైన కారణాలకో, సుఖాలకో, కష్టాలకో, దయకో, క్రూరత్వానికో గుంపు ఎటువైపైనా కదులుతుంది. అది హేతువుకు అందదు. సామూహిక ఉద్రేకంలో వ్యక్తిగత వివేచనా బుద్ధి నశిస్తుంది. ఉదారపూర్వకమైన ఒక విషయాన్ని అంగీకరించవలసిందిగా కోరడం కంటే ఒక సమూహాన్ని ఆత్మహత్యకు పాల్పడవలసిందిగా చెప్పడం చాలా సులభం. మీరు ఎలా కొనసాగాలో నేను చెప్పాల్సిన పని లేదు. భంగీ బస్తీలోను, 10, ఔరంగజేబ్ రోడ్‌లోను మిషన్ వారికి గొప్ప తెలివితేటలు, సమున్నత స్పూర్తి కనిపించాయి. ఆ తెలివి తేటలను, స్పూర్తిని గేలిచేసే వారిలో నేను చివరి వాడిని. మిషన్ కంగారులో ఒక వృద్ధుని దయనీయతను ప్రదర్శించ కూడదా అని నేను అనుకుంటునాను. ఐరిష్ హోం రూల్ ప్రచారోద్యమంలో పాల్గొన్న గ్లాడ్ స్టోన్‌ని వర్ణించడానికి చాంబర్‌లైన్ శీతల కాలం (కూలింగ్ పీరియడ్) అని ఒక పదబంధం ఉపయోగించాడు. అట్లాగే వీళ్ళిప్పుడు సునాయాస మార్గంలో ఉన్నారు.
ఇదంతా మిషన్‌కు ప్రధాన పార్టీలకు, ఆప్రధాన పార్టీలలో నమ్మకం ఉన్న వారికి సంబంధించిన సంగతి. రాజ్యాంగ రక్షణలు కల్పించాలన్న అస్పృశ్యుల డిమాండ్ పట్ల వారి సమస్యల పట్ల మీరు ఎలా వ్యవహరించాలనుకుంటున్నారో తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. సింలా చర్చల ఆఖరి రోజున మిషన్ జారీ చేసిన ప్రకటనలో కొద్ది రోజులలోనే తాము ఢిల్లీకి తిరిగి రాగానే తదుపరి చర్యల ప్రతిపాదనలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. సహజంగానే షెడ్యూల్డ్ కులాల వారు దృష్టి ఈ ప్రకటన వైపు మళ్ళింది. మిషన్ నిర్ణయం వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మిషన్ నిర్ణయాలు అస్పృశ్యుల సుఖమయ స్వేచ్చా జీవితాలకు తలుపులు తెరవనూవచ్చు లేదా వారి ఆశలను సమాధి చేయనూ వచ్చు. ఇది అస్పృశ్యుల జీవన్మరణ సమస్య గనుక ఆ సమస్య గురించి కొద్ది నిముషాలు మీ సమయాన్ని తీసుకోవటం అనుచితం కాబోదు.
అస్పృశ్యుల సమస్య వారు తట్టుకోలేనంత పెద్ద సమస్య. అయితే, దిగువ చెప్పిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకుంటే వాటిని అర్ధం చేసుకోవడం ఎంతో సులభం. ఈ అస్పృశ్యుల చుట్టూ పెద్ద సంఖ్యలో హిందువులు ఆవరించి ఉన్నారు. వీరు అస్పృశ్యుల పట్ల నిర్దయగా వ్యవహరించడమే గాక అక్రమాలు, అత్యాచారాలు జరిపేందుకు కూడా సిగ్గుపడరు. నిత్యం సర్వసాధారణమైపోయిన ఇటువంటి విషయాల గురించి రక్షణ కోసం పాలక వర్గానికి ఫిర్యాదు చేయాలి. కాని పాలక వర్గం స్వభావ స్వరూపాలు ఎలాంటివి? క్లుప్తంగా చెప్పాలంటే భారత దేశంలో పరిపాలన అంతా హిందువుల చేతుల్లోనే ఉంది. అది వారి గుత్తాధిపత్యం. పై నుంచి కింది దాకా వారిదే నియంత్రణ. వారు ఆధిపత్యం వహించని శాఖంటూ లేదు. పోలీసు శాఖ, న్యాయ శాఖ, రెవెన్యూ సర్వీసులు...ఇదీ అదీ అని కాదు, పాలన సంబంధమైన ప్రతి శాఖలోనూ ఇదే పరిస్థితి. ఇక గుర్తుంచుకోవలసిన రిండో ముఖ్యమైన అంశం ఏమిటంటే పాలకులుగా ఉన్న హిందువులను కేవలం అసాంఘిక శక్తులుగా మాత్రమే చెప్పడానికి వీల్లేదు. వారు సంఘ వ్యతిరేకులు, అస్పృశ్యులకు శత్రువులు. అస్పృశ్యుల పట్ల వివక్ష చూపడం, వారికి చట్టం ప్రయోజనాలు అందకుండా చేయడం మాత్రమే కాదు, అణచివేత నుంచి చట్టం వారికి కల్పించే రక్షణను దూరం చేయడం కూడా వారి ప్రధాన లక్ష్యం. ఫలితంగా, హిందూ ప్రజలకూ, హిందువులతో నిండిన అధికార వర్గానికీ మధ్య అస్పృశ్యులు నలిగి పోయారు. ఒకవైపు హిందువులు అత్యాచారాలకు, అక్రమాలకు పాల్పడుతూ ఉంటే ఈ అధికార వర్గం వారు బాధితులైన అస్పృశ్యులకు రక్షణ కల్పించడానికి బదులు హిందువులనే కాపాడుతున్నారు.
ఈ నేపథ్యంలో అస్పృశ్యులపరంగా కాంగ్రెస్ తరహా స్వరాజ్యం అంటే అర్థం ఏమిటి? ఈ రోజు పాలనోద్యోగాలు మాత్రమే హిందువుల చేతుల్లో ఉన్నాయి. స్వరాజ్యం వస్తే విధాన/ శాసనసభలు, కార్యనిర్వాహక మండలులు కూడా హిందువులతో నిండిపోతాయి అని అర్థం. స్వరాజ్యం అస్పృశ్యుల బాధలను మరింత పెంచుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతికూల పాలనకు అదనంగా వారు ప్రతికూల విధాన/ శాసనసభలనూ మొద్దుబారిన కార్యనిర్వాహక మండలినీ అస్పృశ్యుల పట్ల అన్యాయ ప్రవర్తనను నియంత్రించలేని అధికార వర్గాన్నీ, పగ్గాలు వేయలేని విషపూరిత ప్రవర్తననూ చవిచూడవలసి వస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే హిందువులు, హిందూయిజమూ తమకు ఏర్పరచిన ఈ నీచ జీవనస్థితి నుంచి తప్పించుకోవటానికి అస్పృశ్యులకు కాంగ్రెస్ తరహా స్వరాజ్యంలో మరో మార్గమే ఉండదు.
పై సమాచారాన్ని బట్టి ఈ రకమైన స్వరాజ్యాన్ని అస్పృశ్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఈ స్వరాజ్యం అస్పృశ్యుల పాలిట దుర్ఘటనగా మారకుండా ఉండాలంటే చట్టసభలో తమకు తగిన ప్రాతినిధ్యం ఉండాలనీ, తద్వారా హిందువులు తమకు చేసే అన్యాయాలను, తమ పట్ల చేసే తప్పిదాలను ఎదుర్కోవటం సాధ్యమవుతుందనీ అస్పృశ్యులు భావిస్తున్నారు.
కార్యనిర్వాహక వర్గంలో ప్రాతినిధ్యం ఉండడం ద్వారా తమ సమున్నతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికీ అధికారులలో తమ ప్రతినిధులు ఉండడం ద్వారా పాలనాయంత్రాంగం పూర్తిగా తమ పట్ల శత్రుత్వం వహించకుండా చూడడానికీ వీలవుతుంది. ప్రాతినిధ్యం విషయంలో అస్పృశ్యులు పట్టుపట్టటానికి కారణాలు ఇవి. రాజ్యాంగ రక్షణల కోసం అస్పృశ్యులు చేస్తున్న డిమాండ్‌లో న్యాయాన్ని మీరు గమనించగలిగితే వారు ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకు కోరుకుంటున్నారో కూడా అర్ధమవుతుంది. చట్టసభలో అస్పృశ్యులు మైనార్టీలవుతారు. వారు ఎప్పటికీ మైనార్టీలుగానే ఉండిపోతారు. వర్గపరమైన మెజారిటీ స్థిరంగానే ఉండిపోతుంది గనుక వీరు దానిని అధిగమించే అవకాశమే లేదు. వాళ్ళు చేయగలిగిందల్లా ఒక్కటే - మెజారిటీ వర్గం వారు నిర్దేశించిన నియమాలను బలవంతంగా అంగీకరించడం కాకుండా, మెజారిటీతో కలిసి మెలిగేందుకు షరతులను నిర్ణయించుకుంటారు. ఇంకొకటేమిటంటే, మెజారిటీ వర్గం, కలిసి పనిచేయడానికి తిరస్కరించినా తప్పులను సరిదిద్దుకోవటానికి ఒప్పుకోకపోయినా కనీసం చట్టసభలో వీరు తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆవిధంగా నిరసన తెలిపే స్వాతంత్ర్యాన్ని అస్పృశ్యులు ఎప్పుడు ఎలా ఉపయోగించుకోగలరు? అస్పృశ్యుల ప్రతినిధులు మెజారిటీ వర్గపు ఓట్లపై ఆధారపడకుండా చట్టసభలకు ఎన్నికైనప్పుడు మాత్రమే ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్న డిమాండ్‌కు ఇదే ప్రాతిపదిక.
అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలు లేనిపక్షంలో ఎలాంటి రక్షణనైనా సరే అవి అస్పృశ్యులకు ఉపయోగపడవు. ప్రత్యేక నియోజకవర్గమే ఈ విషయంలో అత్యంత కీలకమైనది. 1946 ఏప్రిల్ 9న క్యాబినెట్ మిషన్ ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు కాంగ్రెస్ హరిజనులు క్యాబినెట్ మిషన్‌కు సమర్పించిన వినతిపత్రం ప్రతి నా దగ్గర ఉంది. టూలీవీధిలోని ముగ్గురు దర్జీలు పార్లమెంటునుద్దేశించి "ఇంగ్లండు ప్రజలమైన మేము" అని సాహసం ప్రదర్శించినట్టే ఉంది వీరి విషయమూ. పైగా షెడ్యూల్డు కులాల సమాఖ్య తరపున నేను చేసిన డిమాండ్లకూ, వీరు చెప్పిన దానికీ తేడా ఏమీలేదు. ప్రత్యేక నియోజకవర్గాల విషయం మాత్రమే భేదం. కాంగ్రెస్ హరిజనుల డిమాండ్లను మీరు ఎలా అర్ధం చేసుకుంటారో నాకు తెలియదు. నిజానికి అవి డిమాండ్లు కావు. అవి కేవలం రాజకీయ రక్షణ రూపంలో అస్పృశ్యులకు కాంగ్రెస్ ఇవ్వజూపుతున్నవి మాత్రమే. ఇది నాకు అర్ధమైన సంగతి కాదు - ఇది నాకు తెలిసిన విషయం. ఎందుకంటే, ఉమ్మడి నియోజకవర్గలను నేను అంగీకరించే పక్షంలో కాంగ్రెస్‌వారు నా ఇతర కోరికలన్నిటినీ అంగీకరిస్తారని కాంగ్రెస్ గురించి తెలిసిన వారు నాకు చెప్పారు. కాంగ్రెస్ వారు షెడ్యూల్డు కులాల వారి అన్ని కోరికలూ తీర్చటానికి సిద్దమై ప్రత్యేక నియోజకవర్గాలకే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బహుశా మీరు ఆశ్చర్యపడుతున్నారేమో! కాంగ్రెస్ ఎలాంటి నాటకం ఆడుతున్నదో తెలిస్తే అందులో ఆశ్చర్యమేమీ కనిపించదు. ఆ ఆట చాలా లోతైనది. అస్పృశ్యులకు కొన్ని రక్షణలు కల్పించి తీరాల్సిన పరిస్థితి ఉన్నట్లు కాంగ్రెస్ గమనించడం వల్ల ఇప్పుడు దాని ప్రభావం లేకుండా చూడాలంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నది. ఉమ్మడి నియోజకవర్గాల విధానంలో మాత్రమే ఈ రక్షణల ప్రభావం లేకుండా చేయవచ్చునని భావిస్తున్నది.అందుకే ఉమ్మడి నియోజకవర్గాల కోసం కాంగ్రెస్ పట్టుబడుతున్నది. అప్పుడు అస్పృశ్యులకు అధికారం లేని హోదా ఇవ్వవచ్చు. అస్పృశ్యులు కోరుకుంటున్నది అధికారంతో కూడిన హోదా. ఇది కేవలం ప్రత్యేక నియోజకవర్గాల వలన మాత్రమే సాధ్యమవుతుంది గనుక అందుకోసమే పట్టుబట్టారు.
షెడ్యూల్డ్ కులాలు పోతపోసిన పెట్టె లాంటివి గనుక వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలనే వాదనలో నాకు నమ్మకముంది. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలూ దానిని ఆమోదిస్తున్నాయి. ప్రత్యేక నియోజకవర్గాల వాదనను సమర్ధిస్తూ 1946 మే 3 న లార్డ్ వావెల్‌కు నేనొక లేఖ రాశాను. బహుశా ఆయన దానిని మీకు చూపించే ఉంటారు గనుక నేనిక్కడ తిరిగి ప్రస్తావించడం అనవసరం. ఇక్కడ ప్రశ్నేమిటంటే, షెడ్యూల్డు కులాల వారు చేస్తున్న ఈ డిమాండుకు మిషన్ ఏం చేయబోతున్నది? హిందువుల రాజకీయపు కావిడి మోసే భారాన్నుంచి అస్పృశ్యులను తప్పించబోతున్నదా? లేక కాంగ్రెస్‌నూ అది ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ మెజారిటీని మిత్రులుగా మార్చుకునేందు కోసం ఉమ్మడి నియోజకవర్గాలు సమర్ధించి వారిని తోడేళ్ళకు వేయబోతున్నదా? బ్రిటిష్‌వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలోగా స్వరాజ్యం అనేది షెడ్యూల్డు కులాల వారికి ఉక్కిరిబిక్కిరి సమస్యగా మారకుండా నిర్ధారించవలసిందిగా ఏలినవారి ప్రభుత్వాన్ని కోరే హక్కు షెడ్యూల్డు కులాలవారికి ఉంది.
షెడ్యూల్డు కులాల వారి పట్ల బ్రిటిష్ వారికి నైతిక బాధ్యత ఉన్నదనే విషయం చెప్పనివ్వండి. వాళ్ళకు మైనారిటీలు అందరిపట్లా బాధ్యత ఉండవచ్చు. కానీ అస్పృశ్యుల విషయంలో తమకున్న నైతిక బాధ్యతను అంత సులభంగా ప్రక్కన పెట్టలేరు. ఆ సంగతి కొద్దిమంది బ్రిటిష్ వారికి మాత్రమే తెలియడం అతి కొద్ది మంది మాత్రమే ఆ బాధ్యత నెరవేర్చడం దురదృష్టకరం. భారతదేశంలో బ్రిటిష్ పాలన అస్తిత్వానికే అస్పృశ్యులు చేసిన సేవలు మరువరానివి. భారతదేశాన్ని గెలిచింది క్లైవులు, హేస్టింగులూ, కూట్లూ అనే భావం చాలామంది బ్రిటిష్‌వారిలో ఉంది. అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. భారతదేశాన్ని వారు భారతీయ సైన్యంతోనే గెలిచారు. ఆ భారతీయ సైన్యంలోని వారంతా అస్పృశ్యులు. భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి అస్పృశ్యులు సహాయపడి ఉండకపోతే భారతదేశంలో బ్రిటిష్ పాలన సాధ్యమయ్యేది కారు. బ్రిటిష్ పాలన ఆరంభానికి కారణమైన ప్లాసీ యుద్దం తీసుకోండి, లేదా భారత ఆక్రమణ పూర్తి చేసిన కిర్కీ యుద్దం తీసుకోండి. ఈ రెండు దురదృష్టకరమైన యుద్దాలలోను బ్రిటిష్‌వారి కోసం పోరాడిన సైనికులంతా అస్పృశ్యులే!
తమకోసం పోరాడిన అస్పృశ్యులకోసం బ్రిటిష్‌వారు ఏం చేశారు? అదంతా చెప్పుకుంటే సిగ్గుచేటు. అస్పృశ్యులను సైన్యంలో చేర్చుకోవడాన్ని నిలిపి వేయడం మొదటి చర్య. ఇంత నిర్దయగా, ఇంత క్రూరంగా, ఇంత కృతఘ్నంగా వ్యవహరంచిన ఉదంతం బహుశా చరిత్రలో మరెక్కడా ఉండదు. 1857 తిరుగుబాటులో బలవంతులైన సంస్థానాధీశులంతా ఏకమై తమతో పోరాడినపుడు తమతోపాటు ఉండి తమను రక్షించిన అస్పృశ్యులను ఏమాత్రం గుర్తుంచుకోకుండా వారిని ఇప్పుడు సైన్యం నుండి తొలగించడం బ్రిటిష్‌వారికి చీమకుట్టినట్లయినా అనిపించడం లేదు. దీని ప్రభావం అస్పృశ్యుల మీద ఎలా ఉంటుందో కూడా గమనించకుండా, ఒక్క కలంపోటుతో వారి జీవనాధారాన్ని పోగొట్టి వారిని పూర్వపు అధోగతిలో పడవేశారు. సామాజిక అసహయతల నుండి బైట పడేందుకు వారికి బ్రిటిష్‌వారు సహాయం చేశారా? దీనికి కూడా లేదనే సమాధానం వస్తుంది. పాఠశాలలు, బావులు, మొదలైన సామాన్య ప్రదేశాలకు అస్పృశ్యులు రాకూడదు. దేశ పౌరులుగా, ప్రభుత్వ నిధులతో నిర్వహించే అన్ని సంస్థలకు అస్పృశ్యులు అర్హులేనని చెప్పి ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత బ్రిటిష్ వారిది. కానీ బ్రిటిష్‌వారు అలాంటిదేమీ చేయలేదు. పైగా "అస్పృశ్యత"ను సృష్టించింది తాము కాదంటూ తమ నిష్క్రియా పరత్వాన్ని సమర్ధించుకున్నారు. అస్పృశ్యతను బ్రిటిష్‌వారు సృష్టించకపోవచ్చుగాక. కానీ, అప్పటి సాధారణ పాలకులుగా దేశంలోని అస్పృశ్యతను తొలగించడం వారి బాధ్యత. ప్రభుత్వ విధులు, బాధ్యతలు గుర్తెరిగిన ఏ ప్రభుత్వమూ ఆ విధంగా బాధ్యతను విస్మరించదు. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? హిందూ సమాజాన్ని సంస్కరించే ఏ అంశాన్నీ ముట్టుకునేందుకు అంగీకరించలేదు. సమాజ సంస్కరణ వరకు ఆలోచిస్తే తరతరాలుగా కష్టాలతో, అవమానాలతో, బాధలతో జీవచ్చవాలుగా తాము కాలం గడిపినప్పటి స్వదేశీ రాజుల కాలానికీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని అస్పృశ్యులు తెలుసుకున్నారు. పాలనపరంగా మార్పు నామ మాత్రమే. హిందువుల నిరంకుశత్వ అధికారం పూర్వంలాగానే కొనసాగుతున్నది. దానిని తగ్గించడానికి బదులు బ్రిటిష్ అధిష్టానం మరింత ప్రేమతో పోషిస్తున్నది. సామాజికపరంగా బ్రిటిష్‌వారు అప్పటివరకూ ఉన్న విధానాలనే అంగీకరిస్తూ, వాటినే కాపాడుతూ వచ్చారు. వెనకటికి చైనాలో ఒక దర్జీకి కోటు కుట్టమని కొత్త బట్ట, మాదిరి కోసం పాత కోటు ఇస్తే, కొత్త కోటును అతుకులు, చిరుగులతో సరిగ్గా పాత కోటులాగానే సగర్వంగా కుట్టి ఇచ్చాడట. అలా తయారైంది పరిస్థితి. రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా బ్రిటిష్ వారి పాలనలో అస్పృశ్యులు అస్పృశ్యులుగానే మిగిలిపోయారు. వారి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ప్రతి దశలోనూ వారి అభ్యున్నతికి అడ్డుపుల్లలు పడుతూనే ఉన్నాయి. నిజానికి బ్రిటిష్ పాలన భారతదేశంలో సాధించిందంటూ ఉంటే, అది బ్రాహ్మణత్వాన్ని బలోపేతం చేయడమే. ఈ బ్రాహ్మణత్వమే అస్పృశ్యులకు అనాదిగా శత్రువు. అస్పృశ్యులు తరతరాలుగా పడుతున్న బాధలకు మూలం ఇదే.
"బ్రిటిష్ వారు రాజ్యాధికారం వదులుకొని వెళ్ళిపోతున్నారని ప్రకటించేందుకు మీరిక్కడకు వచ్చారు", ఈ అధికారము, బలమూ ఎవరికి దత్తం చేసి వెళుతున్నారు? (భారతీయులకు) అంటే అస్పృశ్యులను అణచివేసిన వారికా? అని ఒక అస్పృశ్యుడు అడగటంలో తప్పులేదు, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆవిధంగా ముగించడం ఇతర పార్టీల వారికి ఆక్షేపణీయం కాకపోవచ్చు. కానీ బ్రిటిష్ లేబర్ పార్టీ మాటేమిటి? సమాజంలో చిన్న చూపునకు గురైనవారికి, అట్టడుగు వర్గాలకు లేబర్ పార్టీ చేయూతనిచ్చి నిలబడుతోంది. ఆ మాట నిజంగా నిజమైతే, భారతదేశంలోని అరవై మిలియన్ల అస్పృశ్యుల వైపున ఆ పార్టీ నిలబడి వారి పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపడుతుందని నాకు నమ్మకం ఉంది. అస్పృశ్యులకు శత్రువులుగా ఉంటూ తమ మత తత్వధోరణుల దృష్ట్యా పరిపాలనకు అనర్హులైన వారి చేతుల్లోకి, అస్పృశ్యులకు శత్రువులైన వారి చేతుల్లోకి అధికారం వెళ్ళకుండా చూస్తుంది. షెడ్యూల్డు కులాల ట్రస్టీలమని చెప్పుకునే బ్రిటిష్‌వారు నిర్లక్ష్య ధోరణికి అదొక పరిహారం మాత్రం కాగలదు.
అస్పృశ్యులు అడుగుతున్న రాజ్యాంగ రక్షణల విషయంలో క్యాబినెట్ దౌత్యవర్గం వారు మౌనం వహించటం వల్ల కలిగిన ఆతృతతోనే నా ఆవేదన ఇంతగా వెళ్ళగక్కాల్సి వచ్చింది. అస్పృశ్యులకు దౌత్యవర్గం, మైనార్టీలకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఈ ఆందోళనను మరింత పెంచాయి. ఈ వాగ్దానాలకు సంబంధించి దౌత్యవర్గం వైఖరి చూస్తుంటే లార్డ్ పామర్‌స్టన్ మాటలు గుర్తుకొస్తున్నాయి. "మాకు శాశ్వత శత్రువులెవరూ లేరు. మాకు శాశ్వత మిత్రులెవరూ లేరు, మాకు శాశ్వత ప్రయోజనం మాత్రమే ఉంది" అన్నారాయన. దౌత్యవర్గం పామర్‌స్టన్ సామెతనే మార్గదర్శకంగా స్వీకరిస్తున్నదనే అభిప్రాయం కలిగితే అస్పృశ్యులకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో మీరు అర్ధం చేసుకోవచ్చు. గ్రేట్ బ్రిటన్‌లో మీరు ఒక అట్టడుగు వర్గం నుండి వచ్చారు. భారతదేశంలోని ఆరుకోట్ల అట్టడుగు వర్గాలవారు మోసపోయే అవకాశం లేకుండా వారికి మీరు చేయగలిగినంత సాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకముంది. అందుకే వారి సమస్యను మీ ముందుంచాలని ఆలోచించాను. విషయం చెప్పనివ్వండి. ఒక్క విషయం దౌత్యవర్గంలో (మిషన్‌లో) మిమ్మల్ని మించిన మిత్రులెవరూ తమకు లేరని అస్పృశ్యులు అభిప్రాయపడుతున్నారు.
భవదీయుడు
బి.ఆర్. అంబేద్కర్
No comments:
Post a Comment