పాకిస్థాన్ ఫౌండింగ్ ఫాధర్ లలో అలామా ఇక్బాల్, జిన్నాలతో పాటు ఒక ప్రముఖ దళిత నాయకుడు ఉన్నారు. ఆయన పేరు జోగేందర్ నాథ్ మండల్. బెంగాలి. నామసూద్రులు.పాకిస్థాన్ మొట్ట మొదటి న్యాయ శాఖ మంత్రి, కాష్మీర్ వ్యవహారాలను చూసే బాధ్యత కూడా ఆయనకు అప్పగించారు. ఆయన అంబెడ్కర్ కు కుడి భుజం , జిన్నాకు సన్నిహితుడు. ఆయన మొదటి. నుంచి ముస్లిం లీగ్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. దేశ విభజన కు ముందు బెంగాల్ లోని
సుహ్రా వర్ది నాయకత్వం లోని ముస్లిం లీగ్ ప్రభుత్వం లో మంత్రి గా ఉండేవాడు. ముస్లిం లీగ్ మద్దతు తో అంబెడ్కర్ ను రాజ్యాంగ సభకు , బెంగాల్ నుంచి గెలిపించి పంపించాడు. ఆయన అంబెడ్కర్ కు పార్టీ షెడ్యూల్ కేస్ట్ ఫెడరేషన్ బెంగాల్ శాఖ అధ్యక్షుడు.
దేశ విభజన సమయంలో అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు హిందుమహాసభ కు చెందిన శ్యామ ప్రసాద్ ముఖర్జి మొదలైన వాళ్ళు, ఆయనను మనదేశంలో ఉండమని ఎంతగానో నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పాకిస్థాన్ వైపుకు మొగ్గుచూపకుండా అడ్డుకోవటానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. కాని ఆయన జోగేందర్ నాథ్ మండల్ పాకిస్థాన్ వైపుకు మొగ్గు చూపాడు. డైరెక్ట్ యాక్షన్ డే తరువాత కూడా, ఆయన నిర్ణయంలో ఎటువంటి మార్పులేదు.
పాకిస్థాన్ ఏర్పడింది. జిన్నా మరణానంతరం అలీ ఖాన్ ప్రధానిగా అయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అతనికి ప్రాముఖ్యతనివ్వటం తగ్గించేశారు. కాష్మీర్ సంబందించిన మీటింగ్ జరుగూతుంటే, నువ్వు హిందువువి బయటకుపోయి కూర్చోమన్నారట. కాష్మిర్ వ్యవహారాలు చూసే మంత్రిత్వ శాఖ కు చెందిన తనను నమ్మలేకపోవటమేమిటని? ఆ దేశంలో ఆయన స్థానం, తిన్నగా అర్థం కావటం మొదలైంది. అదే సమయంలో మతకలహాలు జరిగి దళితులు, హిందువులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఈయన ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా, ఎవ్వరు ఇతనిని పట్టించుకోలేదు.
ఇక లాభం లేదని, పట్టుమని మూడేళ్ళు కూడా ఉండలేక, భారతదేశానికి వచ్చాడు మంత్రి పదవికి రాజీనామ లేఖరాసి పాకిస్థాన్ ప్రధానికు iccaaDu. లేఖ సుమారు 20 పేజీలు ఉంట్టుంది. అదొక చిన్న సైజు ఆత్మకథ. దేశవిభజన ముందునుంచి, ఎన్నో ఏళ్ళుగా బెంగాల్ లోని ముస్లీం లీగ్ ప్రభుత్వంలో పనిచేసిన, ఆయనకు పాకిస్థాన్లో దళితుల పై జరిగిన దాడులు, ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన దళితులకు చేసిన అన్యాయాలు ఏకరువు పెడతారు.
Ref : A Founding Father we don’t know of http://tns.thenews.com.pk/jogendra-nath-mandal-a-founding-father-we-dont-know/#.WepSEbpuL4g

No comments:
Post a Comment