Tuesday, 5 November 2019

క్రైస్తవ మిషినరీల సేవల నేపథ్యంలో, ప్రధానంగా రెండు ప్రశ్నలు వేయవచ్చు..

భారతదేశంలో క్రైస్తవం సాధించిన ఘనత, క్రైస్తవ మిస్సినరీల మరియూ అస్పృశ్య కులాల దృష్టికోణంలో తరచి పరిశీలించి చూడాల్సిన అంశం.. క్రైస్తవంలో భాగస్థులు అయినవారి వికాసం కోసం క్రైస్తవ మిషనరీలు నిబద్ధతతో పాటుపడుతున్నాయనే విషయం నిస్సందేహం..
భారతదేశంలో మిషనరీల కార్యకలాపాల మొత్తాన్ని ఇక్కడ చర్చించడం కష్టమైన పని. మిషనరీల కార్యకలాపాలను 5 భాగాలుగా వర్గీకరించవచ్చు

1. పిల్లల కోసం
2. యువకుల కోసం
3. జనసమూహం కోసం
4. స్త్రీల కోసం
5. వ్యాధిగ్రస్తులు కోసం
చేసిన పని అమితం. విద్యరంగంలో, వ్యాధులనుండి స్వస్థత కల్పించడానికి క్రైస్తవ మిషనరీలు చేసిన కృషిని, ఈ క్రింది గణాంకాల ద్వారా అంచనా వేయవచ్చును..
I. క్రైస్తవ ఆరోగ్య కార్యకలాపాలు .
1. ఆసుపత్రులు -- 256
2. చికిత్సా కేంద్రాలు (Dispensaries) -- 250
3. ఆరోగ్య కేంద్రాలు (Sanatoriums) -- 10
4. కుష్టు రోగుల ఆవాసాలు -- 38
5. వైద్య కళాశాలలు -- 3
6. ఆసుపత్రులలో ఉన్న పడకల సంఖ్య -- 12,000
7. ఆరోగ్య కేంద్రాలలో ఉన్న పడకల సంఖ్య -- 755
8. విదేశీ వైద్యులు -- 350
9. భారతీయ వైద్యులు -- 390
10. విదేశీ నర్సులు -- 300
11. స్వదేశీ నర్సులు -- 900
12. నర్సింగ్ విద్యార్థులు. -- 1,800
13. నిర్వహించిన శస్త్ర చికిత్సలు -- 44,000
14. ప్రసూతి (కాన్పులు), మొత్తం -- 32,000
15. ఇన్-పేషంట్స్ -- 2,85,000
16. ఔట్-పేషెంట్స్ -- 26,00,000
II. క్రైస్తవ విద్యా కార్యక్రమాలు
సంస్థలు విద్యార్థులు
1. ప్రాధమిక పాఠశాలలు 13,300 6,11,730
2. ప్రాథమికోన్నత పాఠశాలలు. 302 67,229
3. కళాశాలలు 31 11,162
4. క్రైస్తవ మతశాస్త్ర కళాశాలలు
- శిక్షణా కేంద్రాలు. 25 556
5. బైబిల్ శిక్షణా పాఠశాలలు 74 2,085
6. అధ్యాపక శిక్షణా పాఠశాలలు 63 3,153
వీటికి (పై అంశాలకు) బదులుగా చూపించడానికి హిందువుల వద్ద ఏమైనా ఉన్నదా ?? చారిత్రకంగా మాట్లాడుకున్నట్టైతే సాటి మనిషికి సేవ చేయడం అనేది హిందూ మతానికి, హిందువులకు పరిచయం లేని అంశం. హిందూ మతం ప్రాధమికంగా ఆచారాలు, పట్టింపులతో నిండినటువంటిది. హిందూమతం దేవాలయాల మతం. మానవాళి పట్ల ప్రేమకు అందులో చోటు లేదు. మానవాళి పట్ల ప్రేమభావం లేని చోట, మానవ సేవకై ప్రేరణ ఎలా సాధ్యమౌతుంది.. ?? ఈ విషయం హిందువులు దానాలు ఇచ్చిన పద్ధతిలోను, లక్ష్యాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. హిందువులు ఇచ్చే దానాల పద్ధతిలో, లక్ష్యాలలో కులం యొక్క ప్రభావం ఎంతమేరకు ఉంటుందో, భారతదేశంలో నివాసిస్తున్నవాళ్ళలో కూడా కొంతమందికే తెలుసు.

క్రైస్తవ మిషినరీల సేవల నేపథ్యంలో, ప్రధానంగా రెండు ప్రశ్నలు వేయవచ్చు..

1. భారతదేశ క్రైస్తవ సమాజానికి పైన చెప్పబడిన సేవల అవసరం ఎంతవరకూ ఉన్నది?
2. క్రైస్తవ మిషనరీలు పట్టించుకోని, భారతదేశ క్రైస్తవుల అవసరాలు ఏమైనా ఉన్నాయా ?

భారతీయ క్రైస్తవంలో అధిక సంఖ్యాకులుగా అస్పష్య కులాలు, మరియు కొంత సంఖ్య అల్పజాతి శూద్రకులాల ప్రజలే ఉన్నారనే విషయం మర్చిపోరాదు. కాబట్టి మిషనరీల సేవా కార్యక్రమాల మీద తీర్పు చెప్పేటప్పుడు, అవి వీరి అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా అనే కోణంలో పరిశీలించి తీరవలసిందే. మరి ఏమిటా అవసరాలు...??

క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య, వైద్యంలో అందించబడిన సేవలు, భారతీయ క్రైస్తవులకు సమీపములో అందుబాటులో ఉండేవి కాదు. వీరికంటే అవి ఎక్కువగా సవర్ణ హిందూ అగ్రకులస్థులకే ఎక్కువ లబ్ది చేకూర్చాయి. (గతంలో హిందూమత ప్రభావం వలన) అస్పృష్య క్రైస్తవులు అత్యంత పేదవారు ఉండడం మరియూ ఉన్నత విద్యావకాశాలు పొందాలనే ఘాడమైన ఆకాంక్ష తగినంత లేనివారుగా ఉన్నారు. కాబట్టి, అస్పృష్య క్రైస్తవుల వికాసం అనే దృక్కోణంలో చూస్తే, క్రైస్తవ మిషనరీల ద్వారా నిర్వహించబడుతున్న, పాఠ్యశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు చేసిన ఖర్చు మొత్తం వృధాగా అస్పృష్యులకు ఉపయోగపడని రీతిలో చేయబడినది. ఇదే విధంగా మిషనరీలు అందించిన వైద్య సహాయాలు కూడా హిందూ అగ్రకులకే ఉపయోగపడింది. మరీ ముఖ్యంగా ఆసుపత్రుల వినియోగంలో ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం.

ఈ విషయం చాలా క్రైస్తవ మిస్సినరీలకు కూడా అర్ధం అయ్యి జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతీ సంవత్సరం నిధుల కేటాయింపులు జరుగుతూనే ఉంటాయి. ఈ విధమైన కార్యక్రమాల వెనుక ఉన్న లక్ష్యం మిషనరీలతో హిందూ అగ్రకులాలకు సత్సంబంధాలు కల్పించడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మత మార్పిడి లక్ష్యంగా, హిందూ అగ్రకులాలకు ప్రయోజనాలు కల్పించడం అనేది వృధా ప్రయాస అని, అది చివరికి వైఫల్యం వైపే నడిపిస్తుందని క్రైస్తవ మిషనరీలు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదని నా అభిప్రాయం
🔹 పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 567 🔹

No comments:

Post a Comment