Tuesday, 5 November 2019

భారతీయ క్రైస్తవ సమూహం స్వరాజ్య ఉద్యమం లో పాల్గొన్న భాగస్వామ్యం క్రియాశీలకమైనదిగా లేదు. పేజి నంబర్ 597-598

జార్జ్ జోసెఫ్,కె.టి.పాటిల్,యస్.కె. దత్తాలను మినహాయిస్తే భారతీయ క్రైస్తవ సమూహం స్వరాజ్య ఉద్యమం లో పాల్గొన్న భాగస్వామ్యం క్రియాశీలకమైనది గా లేదు. ఈ భావాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన ఉత్తరం కూడా ఒక రకంగా క్రైస్తవ కమ్యూనిటి భావాలను తెలిపేటటువంటిది కూడా. హిందువుల,ముస్లీం ల సరసన క్రైస్తవులను ఎందుకు ప్రస్థావించని కారణమేమిటో స్పష్టం. క్రైస్తవులు స్వరాజ్ ఉద్యమానికి మిత్రులు కాకపోవడం వల్ల వారిని గురించి ప్రస్థావన జరగలేదన్నది నిజం కాదు. వీరు సంఖ్యా పరంగా ప్రభావితం చెయ్యలేని, పరిగనించ దగ్గవారు కాకపోవడం వల్లనే క్రైస్తవుల పేరు మిగతావారి సరసన ప్రస్థావించ బడలేదు.ఈ విధంగా అత్యంత విద్యావంతులు ఉన్న మతానికి దేశ వ్యవహార సరళిలో తగిన స్థానం లభించక పోవడం విచారకరమైన విషయం. ఈ స్థితికి కారణం వారి అల్పసంఖ్యాకత్వమే . ప్రజా జీవితంలో సంఖ్యాపరంగా హిందూ,ముస్లీంల లాగా, అణగారిన వర్గాల మాదిరిగా లేకపోవడమే.అయితే, గుర్తింపు లేని తనానికి కేవలం సంఖ్యా ఆధిక్యత మాత్రమే కారణం కాదు. రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటిది క్రైస్తవులు చాలా వరకు మిషనరీల ప్రాపకంలో నివసిస్తున్నారు. వారి విద్యా,ఆరోగ్యం,ధార్మిక చర్యల విషయంలో అన్నింటా ప్రభుత్వం పై ఆధార పడటం లేదు. మిషనరి సంస్థలపై ఆధారపడుతారు.ప్రభుత్వం పైన ఆధరపడినట్లైతే తమలో తాము వారు సమీకరించుకోవడం,ఆందోళన చేయడం, సమర్దవంతమైన రాజకీయ చర్యలను చేపట్టడనికై వ్యవస్థీ కరణ రూపాలను ఏర్పరచడం సాధ్యమయ్యేది.అటువంటి వ్యవస్థీకరణ లేకుండా ప్రభుత్వం వీరి అవసరాలను గుర్తించదు.వర్తమానంలో క్రైస్తవ కమ్యూనిటి లేకపోవడం వల్ల ప్రజాజీవితంలో ఉండకుండా పోయ్యారు. ప్రజా జీవితంలో లేకపోవడంతో విశాల సమాజంలో స్థానం దక్కకూండా పోయింది. రెండవ కారణం భారతీయ క్రైస్తవ కమ్యునిస్టి సంఘీభావం లేని దాని కన్నా కూడా ఒకరకం గా నిలకడగా సంబంధాలు లేని అసమ్యుక్తమైనది(డిస్ జాయింటేడ్). ఒక్క సాధారణ ప్రేరణ నిచ్చే శక్తి మినహా అన్ని విషయలల్లోను వైవిధ్యమే ఎక్కువ. భ్రారతీయ క్రైస్తవులు మిగతా భారతీయుల లాగా కులం,రంగు,వర్గం ఆధారంగా విభజింపబడినవారు. భాష,కులం,తెగ తేడాలు ఉన్నా వాటిని అధిగమించ గలిగిన సంఘటిత పరిచే బలీయమైన మతంగా క్రైస్తవం రూపొందలేదు.దీనికి తోడు విభాజిత మతపేర్ల మీదుగా కొనసగే తేడా (Denominational Differences) ఒకటి. ఫలితం,క్రైస్తవులు ఏ సాధారణ లక్ష్యం లేక చెల్లా చెదురుగా మిగిలిపోవడమే. ఒక తమిళ క్రైస్తవునికి ,హిందూ తమిళునికి చాలా సాన్నిహిత్యం ఉంట్టుంది. కాని, అదే సాన్నిహిత్యం పంజాబ్ క్రిస్టియన్ తో ఉండదు. ఉత్తర ప్రదేశ్ లోని క్రైస్తవుడు ఆ ప్రాంతంలోని హిందువు పట్ల సాన్నిహిత్యాన్ని అలవర్చుకుంటాడే గాని, మహారాష్ట్ర నుంచి వచ్చిన క్రైస్తవునితో సంఘీభావం ఉండదు. సంక్షిప్తంగా, "భారతీయ క్రైస్తవుడు" అనే పదం గణంక పరమైన ఉపమానం( Statistical Phrase). ఫలితంగా,క్రైస్తవులలో సాముహిక స్పూర్తి లేకుండా పోయింది.ఒక సమూహాన్ని కలిపి ఉంచగలిగే చైతన్యానికి కావలసిన ఏమీ లేకపోవడం వల్ల కమ్యూనిటి దానికి ఉనికి మిగలకుండా పోయింది.

క్రైస్తవ జీవిత విధానంలో బలహీనతలను ఎత్తి చూపిన విధాన్ని,వారిని ప్రభావితం చేస్తున్న మాలిన్యాలను తెలియపరచేందుకు నేను చేసిన ప్రయత్నాన్ని భారతీయ క్రైస్తవులు ఎలా స్వీకరిస్తారో నాకు తెలియదు. ఒక్క విషయం స్పష్టం. క్రైస్తవం అనే అంశం నాకు ఆసక్తి ఉన్నటువంటిది.అనేకులు అస్ప్రుశ్య కులాల నుంది ఇందులోకి ప్రవేశించిన వారు ఉండటమనేది నాకు ప్రత్యేక ఆసక్తి కలిగించిన ముఖ్య అంశం.నా వ్యాఖ్యలు మిత్ర పూర్తితమైనవి. దురభిప్రాయంతో వ్యకీకరించిన అభిసంశనలు కావు. వారిలో ఉన్న బలహీనతలను ఎత్తి చూపినాను. వారు బలంగా ఎదగాలంటే బలహీనతలను అర్థం చేసుకోవాలి.

పేజి నంబర్ 597-598
డా|| బాబా సాహేబ్ అంబెద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటం :5
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచూరణలు 1994

No comments:

Post a Comment