Tuesday, 5 November 2019

నువ్వు దళిత క్రైస్తవుడివైతే అది నీ ఇష్టం. కానీ బీసీ సీ గా నమోదైతేనే నష్టం.

మొదట ఈ ప్రశ్నలకు జవాబుచెప్పు
1. 1835 లో ఎందరు అశ్పృశ్యులు విధ్యాధికులు అయ్యారు?
2. అదే సమయంలో ఇంగ్లీషు చదువుల వలన పై కులాల వారు ఎందరు లబ్ధి పొందారు?
3. ఇంగ్లీషు విధ్య కేవలం అంటరాని జనాల కోసమే అని ఎక్కడైనా ఇంగ్లీషు వాళ్ళు ప్రకటించారా?
4. తెల్లవాళ్ల కొలువులో ప్రధాన పధవులు అలంకరించింది అంటరాని వాళ్లా లేక పై కులాలవాళ్ళా?
5. మొదట క్రైస్తవ మతంలోకి ఆహ్వానించబడింది భారత అగ్రకులాలా లేక దళితులా?
6. ఆంగ్లేయుల విధ్యా, వైధ్యాలయాల్లో అత్యధికశాతం మేలు పొందింది అంటరానివాళ్లా లేక పెద్దకులాలా?
7. దళిత మూలవాసులకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వనందుకు అంబేద్కర్ బ్రిటీష్ వాళ్ళను ఎందుకు నిలదీస్తూ వాళ్ళు కృతఘ్నులు అని పేర్కొన్నాడు?
8. 1843 బ్రిటీష్ బానిసత్వ నిర్మూలనా చట్టం తరవాత దళితులు నిజంగా దాన్నుండి బయటపడగలిగారా? మా తండ్రుల తరం కూడా ఎలా జీతగాళ్ళుగా బ్రతికారు? కానీ కేవలం భారత రాజ్యంగం అమలుపరచబడిన అనతికాలంలోనే ఆ పరిస్థితి దాదాపు ఎలా అంతరించిపోయింది? ఇందులో ఎవరికి ఆ క్రెడిట్ ఇవ్వాలి?
9. ఒకవేళ దళితోద్దరణే బ్రిటీష్ వాళ్ళ ఆశయమైతే కులాన్ని నిర్మూలిస్తూ, కుల వివక్షకు తగిన దండన విధిస్తూ చట్టం ఎందుకు చెయ్యలేదు? ఎలాగూ వారే పరిపాలకులు కదా... మొత్తం అధికారం వారి చేతుల్లోనే వుంది కదా?
10. ఒకపక్క నిమ్నులు అమానవీయ జీవితం గడుపుతుంటే బ్రిటీష్ వాళ్ళు భారత రాజప్రాసాదాల్లో, జమీందార్ల కోటల్లో విందూ వినోదాల్లో తూగుతూ, వాళ్ళు తార్చిన శూద్ర దళిత స్త్రీలతో పొర్లుతూ, ఆ రాజులకు 'బిరుధులూ, పట్టాలూ' ఎలా కట్టబెట్టారు?
11. బ్రిటీష్ పాలనలో ఉన్నత స్తానంలో పనిచేసిన దళిత జీవుల పేర్లు ఒక పది చెప్పగలరా? అదే పాలకుల ఇళ్ళల్లో పంఖా మనుషులుగా, చెప్పులు కుట్టేవాళ్ళుగా, పారిశుధ్య పనివారుగా, పీతిగుడ్డలు ఉతికే వారిగా పనిచేసిన లక్షలమందిని చూపిస్తా.
12. ఇంగ్లీషువాళ్ళు దళితుల్ని అసలు అలాంటి పనిలోకైనా రానివ్వడమే గొప్ప మేలు అని మీరంటారా?
13. బ్రిటీష్ దొరసానులు అనేకమంది అగ్ర కులాల పురుషుల్ని, జమీందారుల్నీ ప్రేమించి వరించారు. అలా ఎవరైనా దళితుల్ని పెళ్ళాడిన దాఖలాలు వున్నాయా? ఎన్ని వున్నాయి? నేను కనీసం 600 ఉదాహరణలు చూపిస్తా.

ఇప్పటికి ఇవి చాలు.... ! ముఖం కనిపించకుండా ఎంతటి దుర్భాషలైనా మాట్లాడే ధైర్యం కూడా ఒక ఉద్యమమేనా? కనీసం సొంత ఐడెంటిటీని కూడా కనుమరుగు చేసుకుని కేవలం బూతులూ నిందలూ చెయ్యడానికే ఫేక్ సిద్దపడే మనుషులతో చర్చలు చేసే సమయం నాకు వుందా? పారిపోకుండా సమాధానం చెప్పు. పక్కదారి పట్టిస్తే మీ భాషలోనే సమాధానం గ్యారెంటీ. వ్యక్తిగత నిందలూ వులపరాలూ ఇక్కడ జాంతానై.

నువ్వు దళిత క్రైస్తవుడివైతే అది నీ ఇష్టం. కానీ బీసీ సీ గా నమోదైతేనే నష్టం.
1. నీ కులాన్నిబట్టి నీమీద చేసే దాడులకు, అవమానాలకు కవచంగా పనిచేసే అట్రాసిటీ చట్టం నీకు వర్తించదు. నీకు ఈ రక్షణ లేదు అని తెలిసి నీమీదే ముందు దాడి చేస్తారు. అంటే దళితుల్లో కుడా నువ్వే అత్యంత ప్రమాదకరమైన అంచున ఉన్నావాడవు అవుతావు. ఒకవేళ కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా, ఆ తరవాత కూడా నీ జనులకు మద్దతుగా మాట్లాడాలన్నా ఆఫీసులో నీకు భద్రత దొరకదు. అటు ఎస్సి ఎస్టీ సంఘానికీ చెందక, ఇటు బిసిలు కలుపుకోక నువ్వు నడిమధ్యన వదిలెయ్యబడిన నావలాగా కొట్టుకుపోతావు.

https://www.facebook.com/indusmartin/posts/10216030289404240


చర్చీల నిండా ఓసీ/బీసీ ఆధిపత్యం కమ్ముకున్నప్పుడు 'దళిత క్రైస్తవులు కుల స్పృహ లేకుండా చర్చీలకు వెళ్ళాలి ' అని బోధించడం పైకులాల పాస్టర్ల మోసపు పధకమే అవుతుంది. ఓసీ/బీసీ క్రైస్తవులు దళిత పాస్టర్ల చర్చీలకు, మరీ ముఖ్యంగా ఆదిమ తెలుగు క్రైస్తవ సంఘాలైన ఏఇఎల్ సీ, బాప్టిస్ట్, సీ ఎస్ ఐ, సాల్వేషన్ ఆర్మీ వంటి చర్చీలకు ఇలాగే కుల స్పృహ లేకుండా వెళ్ళాలి అని ప్రకటన చేసే నిజాయితీ లేని ఈ పై కులాల పాస్టర్ల బోధలు దోపుడు సొమ్ముకు ఆశపడే దొంగల మోసపు మాటలే.
https://www.facebook.com/indusmartin/posts/10216007160866041

అబద్దీకులైన క్రైస్తవ ప్రచారకులు, ప్రచారకరాళ్లనుండి దూరంగా ఉండండి. ఎప్పటికప్పుడు తమను తాము గ్లామరస్ గా, శాంతి కాముకులుగా బయట ప్రపంచానికి చూపించుకునే వీరు, లోపల వట్టి అబద్దీకులు, వదరబోతులు, అజ్ఞానులు అని గుర్తించండి.

https://www.facebook.com/indusmartin/posts/10215728284294301

ఇక్కడి దళితులతోపాటే అదే కాలంలో జీవించిన దక్షిణ ఎమేరికా మయన్ సంస్కృతి ప్రజలు, ఉత్తర ఎమేరికా రెడ్ ఇండియన్ ప్రజలు, న్యూజీ ల్యాండ్ మావోరీ ప్రజలు, ఆస్ట్రేలియన్ అబోరిజియన్స్ కానీ దళితులు అలా అవ్వలేదు చూడు. అన్ని ప్రతికూల పరిస్థితులకూ ఎదురొడ్డి ఇప్పటికీ ఈ దేశ జనాభాలో 17% (అత్యధికంగా ఉన్న ఒకే ఒక జాతి) గా నిలబడ్డారు. వీరి చరిత్ర నాలుగు వేల సంవత్సరాలది. ఇందులో తెల్లవాళ్ల చరిత్ర ఎంత? మొత్తం మూడు వందల ఏళ్ళ వారి పాలనలో ఎంతకాలం తరవాత వాళ్ళు ఈ నల్ల మనుషుల అభ్యున్నతికి పూనుకున్నారూ? ఎందరు నల్ల మనుషుల్ని వీళ్ళు స్పృశించారూ? ఎన్ని ప్రాంతాలకు వీరు వెళ్ళగలిగారూ? భారత దేశంలో దాదాపు కేవలం తీరప్రాంతాలకే పరిమితమైన మిషనరీలు ఎప్పుడు పని మొదలు పెట్టారు? బ్రిటీష్ వాళ్ళు మొదట ఇక్కడికి వచింది వ్యాపారం కోసమేగా? వ్యాపారం నిలదొక్కుకున్నాకే మతాన్ని ప్రచారం చేసుకోటానికి పూనుకున్నారుగా? అలాంటప్పుడు దళితులు వీరి వలననే బ్రతికి బట్టకట్టగలిగారు అనడం ఎంత సిగ్గుమాలిన వాదన?

https://www.facebook.com/indusmartin/posts/10216038900979524


"ప్రతి చర్చిలో మాల మాదిగ ఇద్దరు వుంటారు ,అంబేద్కర్ని ఒక కుల నాయకుడిగా చూసే వాళ్ళు ఎక్కువ ....పాస్టర్స్ కి ఇద్దరు కావాలి ,లేని పోనీ గొడవలు ఎందుకు అని ఆయన ప్రస్తావన చర్చీలలో ఎత్తే రిస్క్ చేయరు. అలా చేస్తే చర్చీలలో కులపరమైన గొడవలు తీవ్రమౌతాయి. అందుకే అంబేద్కర్ ప్రస్తావన చర్చీలలో చెయ్యరు." ----- ఇమ్మానియేల్ మహరాజ్ మానికొండ

https://www.facebook.com/indusmartin/posts/10215244846288653


చర్చీల నిండా ఓసీ/బీసీ ఆధిపత్యం కమ్ముకున్నప్పుడు 'దళిత క్రైస్తవులు కుల స్పృహ లేకుండా చర్చీలకు వెళ్ళాలి ' అని బోధించడం పైకులాల పాస్టర్ల మోసపు పధకమే అవుతుంది. ఓసీ/బీసీ క్రైస్తవులు దళిత పాస్టర్ల చర్చీలకు, మరీ ముఖ్యంగా ఆదిమ తెలుగు క్రైస్తవ సంఘాలైన ఏఇఎల్ సీ, బాప్టిస్ట్, సీ ఎస్ ఐ, సాల్వేషన్ ఆర్మీ వంటి చర్చీలకు ఇలాగే కుల స్పృహ లేకుండా వెళ్ళాలి అని ప్రకటన చేసే నిజాయితీ లేని ఈ పై కులాల పాస్టర్ల బోధలు దోపుడు సొమ్ముకు ఆశపడే దొంగల మోసపు మాటలే.


https://www.facebook.com/indusmartin/posts/10216007160866041

కేరళలో క్రైస్తవులంటే సవర్ణ కులాలే. దళిత కులాలనుండి క్రైస్తవ మతంలోకి మారిన వారిని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు. అంటే క్రైస్తవం అక్కడ ప్రధానంగా సవర్ణులదే. మరి మనోళ్ళేమో దేశంలో క్రైస్తవం దళితులదే అని స్టేట్మెంట్లు ఇస్తూ అమాయక దళితుల్ని మోసం చేస్తూ దళిత విముక్తికి పోరాడాల్సిన యువతను క్రైస్తవ మత పౌరుషం కోసం పోరాడేటట్టు హైజాక్ చేస్తున్నారేం? ఎంత మోసం ఇది? దళిత ఆత్మగౌరవ పోరాటం అంటే క్రైస్తవ మత గౌరవ పోరాటమా? ఈ దేశంలోని చర్చీలు ఎవడి ఆధీనంలో వున్నాయీ? క్రైస్తవ ఆస్తులు ఎవరి ఆధీనంలో వున్నాయీ? క్రైస్తవ దళితుడు మిగతా దళితుడికన్నా ఎక్కువ వివక్షితుడు కాదా? సమాజం చేతా, ప్రభుత్వం చేతా వివక్షించబడే దళితుడు ఇప్పుడు చర్చీలోనూ వివక్షకు గురికావడం లేదా? దోపిడీ కులాల అజమాయిషీల్లో వున్నా చర్చీల్లో దళితులు పాస్టర్లూ, డీకన్లూ కాగలరా? దళితుల అజమాయిషీలో వున్నా చర్చీల్లో దోపిడీ కులాల భక్తులకు దొరికే ఎక్స్ట్రా మర్యాద, ప్రత్యేక ప్రార్ధనలను ఆపగలరా?

https://www.facebook.com/indusmartin/posts/10215363037883369


'చర్చీలలో అంబేద్కర్ సిద్దాంతాలను సూత్రప్రాయంగా ప్రస్తావించవచ్చేమో ఆలోచించండీ' అని ప్రాధేయ పడితేనే బూతులు తిట్టిన జనాలకు అంబేద్కర్ పేరును తమ సంస్థల బేనర్లలో, మతకూడికల్లో వాడుకునే నైతిక అర్హత వుందా? అంబేద్కర్ చర్చీకి అంటరానివాడు, కానీ క్రైస్తవ మహాసభలకు కాదా?


అంబేద్కరిస్టులు క్రైస్తవ సమాజంలోని మకిలి గురించి మాట్లాడటం నిషిద్దం. కానీ క్రైస్తవులు అంబేద్కర్ సంఘాలలోని తప్పొప్పుల్ని ఎండగట్టడానికి మాత్రం అర్హులు. అంబేద్కరిస్టులు క్రైస్తవం గురించి మాట్లాడితే వారు దళిత వేర్పాటు వాదులు. కానీ క్రైస్తవులు అంబేద్కర్ సంఘాలను చీల్చి చెండాడినా వాళ్ళు శ్రేయోభిలాషులు. అవును... అంబేద్కర్ అంటేనే ఒక వివక్షిత భావం. క్రైస్తవ సంఘాలకు అంబేద్కర్ సంఘాలు నిమ్నమైనవే....ఎందుకంటే అందులో వుండేది ఎస్సీలు... బీసీ సీలు కాదు. ఒకవేళ ఎస్సిలు ఉన్నా, వారు క్రీస్తును తెలుసుకున్న ఎస్సిలు... అన్య ఎస్సిలకన్నా అధికులు.

https://www.facebook.com/indusmartin/posts/10215244533600836

శ్రీఏసు రక్ష సర్వ జగద్రక్ష (The Rise of Israel ) -------- Indus Martin

ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ దేశాలు ఇజ్రాయేల్ దేశాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాయీ? ఇంత ప్రేమించినా ఇజ్రాయేల్ ఇంకా యూద మతాన్నే తమ రాజ్యమతంగా గుర్తిస్తూ క్రైస్తవాన్ని ఎందుకు దూరం పెడుతుందీ? 76% యూదులు, 17% ముస్లింలు ఉన్నా దేశంలో ప్రపంచ క్రైస్తవ దేశాలు హోలీ ల్యాండ్ అని పిలుచుకుంటూ ఉన్నప్పటికీ క్రైస్తవుల సంఖ్య కేవలం 2% మాత్రమే ఎందుకు ఉందీ?


రండి ... ఒక నిజ నిర్ధారణ చేద్దాం!

https://www.facebook.com/indusmartin/posts/10217114893238658


బానిస బైబిల్ -- (శ్రీఏసు రక్ష సర్వ జగద్రక్ష -2)
------------------------------------------------------------
"ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగిన వారికి ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు " ... బైబిల్ మొత్తంలో ఏసు స్వయంగా చదివి వినిపించిన వాక్యం ఇదే. తన బోధనల వెనుక వున్న కారణాన్ని ఇంత చక్కగా వివరించాడు కదా...?

https://www.facebook.com/indusmartin/posts/10217117495063702


నీ మతం చర్చకు వచ్చినప్పుడల్లా నువ్వు అసహనానికి గురౌతున్నావంటే...
1. నీ మతం దొంగది
లేదా
2. నువ్వే దొంగవు
3. ఒక్కోసారి రెండూ కరెక్టే కావచ్చు.
https://www.facebook.com/indusmartin/posts/10215240127050675

క్రైస్తవాన్ని సమర్ధించుకోడానికి తెల్లజాతి మొత్తానికీ పునీతుల సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అగత్యంలో పడ్డారు దళిత బిడ్డలు. పొరపాట్న ఆరెస్సెస్ వాళ్ళు జీసస్ కూడా దేవుడే అంటే మనువాదం మన మంచికే అని కూడా అనెయ్యగలరు. మతం ... అన్ని దౌర్భాగ్యాలనూ మరిపించి లాలూచీలను ప్రేరేపిస్తుంది.


అంబెడ్కర్ వాదుల్ని దున్నమాంసం తిని మెదళ్ళు మొద్దుబారిన జాతి అని తిడుతున్న ఇలాంటి క్రైస్తవ ఉన్మాదుల్ని ఎక్కడున్నా అవమానించండి. అచ్చం మనువాదుల్లాగానే ఆహారం, భాష మీద పెత్తనం చేయులనుకునే, తిండిని బట్టి అవమానించాలనుకునే వీళ్లే క్రైస్తవులు. భారత క్రైస్తవం హిందూ మతానికి ఏమాత్రం తీసిపోదు అని చెప్పే బూతు మనుషులు తిరుగుతున్నారు. వీళ్లవలన ఏసుకు నామర్థ మినహా మరే లాభం లేదు. పాపి కొరకే ఈ లోకానికి వచ్చాను అని ఏసు చెబుతుంటే వీళ్లు జనాల మీద జడ్జిల్లా సిగ్గు విడిచి బోకరిస్తున్నారు. ఈ క్రింది దళిత విరోధి.మీద కేస్ పెట్టడానికి సలహా ఇవ్వండి. తిండినిబట్టి అవమానించిన నేరానికి లోపల.వేయించాలి.

https://www.facebook.com/indusmartin/posts/10215980649683278

క్రైస్తవ మిషినరీల సేవల నేపథ్యంలో, ప్రధానంగా రెండు ప్రశ్నలు వేయవచ్చు..

భారతదేశంలో క్రైస్తవం సాధించిన ఘనత, క్రైస్తవ మిస్సినరీల మరియూ అస్పృశ్య కులాల దృష్టికోణంలో తరచి పరిశీలించి చూడాల్సిన అంశం.. క్రైస్తవంలో భాగస్థులు అయినవారి వికాసం కోసం క్రైస్తవ మిషనరీలు నిబద్ధతతో పాటుపడుతున్నాయనే విషయం నిస్సందేహం..
భారతదేశంలో మిషనరీల కార్యకలాపాల మొత్తాన్ని ఇక్కడ చర్చించడం కష్టమైన పని. మిషనరీల కార్యకలాపాలను 5 భాగాలుగా వర్గీకరించవచ్చు

1. పిల్లల కోసం
2. యువకుల కోసం
3. జనసమూహం కోసం
4. స్త్రీల కోసం
5. వ్యాధిగ్రస్తులు కోసం
చేసిన పని అమితం. విద్యరంగంలో, వ్యాధులనుండి స్వస్థత కల్పించడానికి క్రైస్తవ మిషనరీలు చేసిన కృషిని, ఈ క్రింది గణాంకాల ద్వారా అంచనా వేయవచ్చును..
I. క్రైస్తవ ఆరోగ్య కార్యకలాపాలు .
1. ఆసుపత్రులు -- 256
2. చికిత్సా కేంద్రాలు (Dispensaries) -- 250
3. ఆరోగ్య కేంద్రాలు (Sanatoriums) -- 10
4. కుష్టు రోగుల ఆవాసాలు -- 38
5. వైద్య కళాశాలలు -- 3
6. ఆసుపత్రులలో ఉన్న పడకల సంఖ్య -- 12,000
7. ఆరోగ్య కేంద్రాలలో ఉన్న పడకల సంఖ్య -- 755
8. విదేశీ వైద్యులు -- 350
9. భారతీయ వైద్యులు -- 390
10. విదేశీ నర్సులు -- 300
11. స్వదేశీ నర్సులు -- 900
12. నర్సింగ్ విద్యార్థులు. -- 1,800
13. నిర్వహించిన శస్త్ర చికిత్సలు -- 44,000
14. ప్రసూతి (కాన్పులు), మొత్తం -- 32,000
15. ఇన్-పేషంట్స్ -- 2,85,000
16. ఔట్-పేషెంట్స్ -- 26,00,000
II. క్రైస్తవ విద్యా కార్యక్రమాలు
సంస్థలు విద్యార్థులు
1. ప్రాధమిక పాఠశాలలు 13,300 6,11,730
2. ప్రాథమికోన్నత పాఠశాలలు. 302 67,229
3. కళాశాలలు 31 11,162
4. క్రైస్తవ మతశాస్త్ర కళాశాలలు
- శిక్షణా కేంద్రాలు. 25 556
5. బైబిల్ శిక్షణా పాఠశాలలు 74 2,085
6. అధ్యాపక శిక్షణా పాఠశాలలు 63 3,153
వీటికి (పై అంశాలకు) బదులుగా చూపించడానికి హిందువుల వద్ద ఏమైనా ఉన్నదా ?? చారిత్రకంగా మాట్లాడుకున్నట్టైతే సాటి మనిషికి సేవ చేయడం అనేది హిందూ మతానికి, హిందువులకు పరిచయం లేని అంశం. హిందూ మతం ప్రాధమికంగా ఆచారాలు, పట్టింపులతో నిండినటువంటిది. హిందూమతం దేవాలయాల మతం. మానవాళి పట్ల ప్రేమకు అందులో చోటు లేదు. మానవాళి పట్ల ప్రేమభావం లేని చోట, మానవ సేవకై ప్రేరణ ఎలా సాధ్యమౌతుంది.. ?? ఈ విషయం హిందువులు దానాలు ఇచ్చిన పద్ధతిలోను, లక్ష్యాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. హిందువులు ఇచ్చే దానాల పద్ధతిలో, లక్ష్యాలలో కులం యొక్క ప్రభావం ఎంతమేరకు ఉంటుందో, భారతదేశంలో నివాసిస్తున్నవాళ్ళలో కూడా కొంతమందికే తెలుసు.

క్రైస్తవ మిషినరీల సేవల నేపథ్యంలో, ప్రధానంగా రెండు ప్రశ్నలు వేయవచ్చు..

1. భారతదేశ క్రైస్తవ సమాజానికి పైన చెప్పబడిన సేవల అవసరం ఎంతవరకూ ఉన్నది?
2. క్రైస్తవ మిషనరీలు పట్టించుకోని, భారతదేశ క్రైస్తవుల అవసరాలు ఏమైనా ఉన్నాయా ?

భారతీయ క్రైస్తవంలో అధిక సంఖ్యాకులుగా అస్పష్య కులాలు, మరియు కొంత సంఖ్య అల్పజాతి శూద్రకులాల ప్రజలే ఉన్నారనే విషయం మర్చిపోరాదు. కాబట్టి మిషనరీల సేవా కార్యక్రమాల మీద తీర్పు చెప్పేటప్పుడు, అవి వీరి అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా అనే కోణంలో పరిశీలించి తీరవలసిందే. మరి ఏమిటా అవసరాలు...??

క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య, వైద్యంలో అందించబడిన సేవలు, భారతీయ క్రైస్తవులకు సమీపములో అందుబాటులో ఉండేవి కాదు. వీరికంటే అవి ఎక్కువగా సవర్ణ హిందూ అగ్రకులస్థులకే ఎక్కువ లబ్ది చేకూర్చాయి. (గతంలో హిందూమత ప్రభావం వలన) అస్పృష్య క్రైస్తవులు అత్యంత పేదవారు ఉండడం మరియూ ఉన్నత విద్యావకాశాలు పొందాలనే ఘాడమైన ఆకాంక్ష తగినంత లేనివారుగా ఉన్నారు. కాబట్టి, అస్పృష్య క్రైస్తవుల వికాసం అనే దృక్కోణంలో చూస్తే, క్రైస్తవ మిషనరీల ద్వారా నిర్వహించబడుతున్న, పాఠ్యశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు చేసిన ఖర్చు మొత్తం వృధాగా అస్పృష్యులకు ఉపయోగపడని రీతిలో చేయబడినది. ఇదే విధంగా మిషనరీలు అందించిన వైద్య సహాయాలు కూడా హిందూ అగ్రకులకే ఉపయోగపడింది. మరీ ముఖ్యంగా ఆసుపత్రుల వినియోగంలో ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం.

ఈ విషయం చాలా క్రైస్తవ మిస్సినరీలకు కూడా అర్ధం అయ్యి జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతీ సంవత్సరం నిధుల కేటాయింపులు జరుగుతూనే ఉంటాయి. ఈ విధమైన కార్యక్రమాల వెనుక ఉన్న లక్ష్యం మిషనరీలతో హిందూ అగ్రకులాలకు సత్సంబంధాలు కల్పించడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మత మార్పిడి లక్ష్యంగా, హిందూ అగ్రకులాలకు ప్రయోజనాలు కల్పించడం అనేది వృధా ప్రయాస అని, అది చివరికి వైఫల్యం వైపే నడిపిస్తుందని క్రైస్తవ మిషనరీలు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదని నా అభిప్రాయం
🔹 పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 567 🔹

భారతీయ క్రైస్తవ సమూహం స్వరాజ్య ఉద్యమం లో పాల్గొన్న భాగస్వామ్యం క్రియాశీలకమైనదిగా లేదు. పేజి నంబర్ 597-598

జార్జ్ జోసెఫ్,కె.టి.పాటిల్,యస్.కె. దత్తాలను మినహాయిస్తే భారతీయ క్రైస్తవ సమూహం స్వరాజ్య ఉద్యమం లో పాల్గొన్న భాగస్వామ్యం క్రియాశీలకమైనది గా లేదు. ఈ భావాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన ఉత్తరం కూడా ఒక రకంగా క్రైస్తవ కమ్యూనిటి భావాలను తెలిపేటటువంటిది కూడా. హిందువుల,ముస్లీం ల సరసన క్రైస్తవులను ఎందుకు ప్రస్థావించని కారణమేమిటో స్పష్టం. క్రైస్తవులు స్వరాజ్ ఉద్యమానికి మిత్రులు కాకపోవడం వల్ల వారిని గురించి ప్రస్థావన జరగలేదన్నది నిజం కాదు. వీరు సంఖ్యా పరంగా ప్రభావితం చెయ్యలేని, పరిగనించ దగ్గవారు కాకపోవడం వల్లనే క్రైస్తవుల పేరు మిగతావారి సరసన ప్రస్థావించ బడలేదు.ఈ విధంగా అత్యంత విద్యావంతులు ఉన్న మతానికి దేశ వ్యవహార సరళిలో తగిన స్థానం లభించక పోవడం విచారకరమైన విషయం. ఈ స్థితికి కారణం వారి అల్పసంఖ్యాకత్వమే . ప్రజా జీవితంలో సంఖ్యాపరంగా హిందూ,ముస్లీంల లాగా, అణగారిన వర్గాల మాదిరిగా లేకపోవడమే.అయితే, గుర్తింపు లేని తనానికి కేవలం సంఖ్యా ఆధిక్యత మాత్రమే కారణం కాదు. రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

మొదటిది క్రైస్తవులు చాలా వరకు మిషనరీల ప్రాపకంలో నివసిస్తున్నారు. వారి విద్యా,ఆరోగ్యం,ధార్మిక చర్యల విషయంలో అన్నింటా ప్రభుత్వం పై ఆధార పడటం లేదు. మిషనరి సంస్థలపై ఆధారపడుతారు.ప్రభుత్వం పైన ఆధరపడినట్లైతే తమలో తాము వారు సమీకరించుకోవడం,ఆందోళన చేయడం, సమర్దవంతమైన రాజకీయ చర్యలను చేపట్టడనికై వ్యవస్థీ కరణ రూపాలను ఏర్పరచడం సాధ్యమయ్యేది.అటువంటి వ్యవస్థీకరణ లేకుండా ప్రభుత్వం వీరి అవసరాలను గుర్తించదు.వర్తమానంలో క్రైస్తవ కమ్యూనిటి లేకపోవడం వల్ల ప్రజాజీవితంలో ఉండకుండా పోయ్యారు. ప్రజా జీవితంలో లేకపోవడంతో విశాల సమాజంలో స్థానం దక్కకూండా పోయింది. రెండవ కారణం భారతీయ క్రైస్తవ కమ్యునిస్టి సంఘీభావం లేని దాని కన్నా కూడా ఒకరకం గా నిలకడగా సంబంధాలు లేని అసమ్యుక్తమైనది(డిస్ జాయింటేడ్). ఒక్క సాధారణ ప్రేరణ నిచ్చే శక్తి మినహా అన్ని విషయలల్లోను వైవిధ్యమే ఎక్కువ. భ్రారతీయ క్రైస్తవులు మిగతా భారతీయుల లాగా కులం,రంగు,వర్గం ఆధారంగా విభజింపబడినవారు. భాష,కులం,తెగ తేడాలు ఉన్నా వాటిని అధిగమించ గలిగిన సంఘటిత పరిచే బలీయమైన మతంగా క్రైస్తవం రూపొందలేదు.దీనికి తోడు విభాజిత మతపేర్ల మీదుగా కొనసగే తేడా (Denominational Differences) ఒకటి. ఫలితం,క్రైస్తవులు ఏ సాధారణ లక్ష్యం లేక చెల్లా చెదురుగా మిగిలిపోవడమే. ఒక తమిళ క్రైస్తవునికి ,హిందూ తమిళునికి చాలా సాన్నిహిత్యం ఉంట్టుంది. కాని, అదే సాన్నిహిత్యం పంజాబ్ క్రిస్టియన్ తో ఉండదు. ఉత్తర ప్రదేశ్ లోని క్రైస్తవుడు ఆ ప్రాంతంలోని హిందువు పట్ల సాన్నిహిత్యాన్ని అలవర్చుకుంటాడే గాని, మహారాష్ట్ర నుంచి వచ్చిన క్రైస్తవునితో సంఘీభావం ఉండదు. సంక్షిప్తంగా, "భారతీయ క్రైస్తవుడు" అనే పదం గణంక పరమైన ఉపమానం( Statistical Phrase). ఫలితంగా,క్రైస్తవులలో సాముహిక స్పూర్తి లేకుండా పోయింది.ఒక సమూహాన్ని కలిపి ఉంచగలిగే చైతన్యానికి కావలసిన ఏమీ లేకపోవడం వల్ల కమ్యూనిటి దానికి ఉనికి మిగలకుండా పోయింది.

క్రైస్తవ జీవిత విధానంలో బలహీనతలను ఎత్తి చూపిన విధాన్ని,వారిని ప్రభావితం చేస్తున్న మాలిన్యాలను తెలియపరచేందుకు నేను చేసిన ప్రయత్నాన్ని భారతీయ క్రైస్తవులు ఎలా స్వీకరిస్తారో నాకు తెలియదు. ఒక్క విషయం స్పష్టం. క్రైస్తవం అనే అంశం నాకు ఆసక్తి ఉన్నటువంటిది.అనేకులు అస్ప్రుశ్య కులాల నుంది ఇందులోకి ప్రవేశించిన వారు ఉండటమనేది నాకు ప్రత్యేక ఆసక్తి కలిగించిన ముఖ్య అంశం.నా వ్యాఖ్యలు మిత్ర పూర్తితమైనవి. దురభిప్రాయంతో వ్యకీకరించిన అభిసంశనలు కావు. వారిలో ఉన్న బలహీనతలను ఎత్తి చూపినాను. వారు బలంగా ఎదగాలంటే బలహీనతలను అర్థం చేసుకోవాలి.

పేజి నంబర్ 597-598
డా|| బాబా సాహేబ్ అంబెద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటం :5
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచూరణలు 1994

కులాన్ని తొలగించలేని క్రైస్తవుల వల్ల హిందువులకు ఒరిగిందేమిటి? PAGE 587 -591

1813 తర్వాత ట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం మిషనరీల కార్యకలాపాలను అనుమతించిన ప్పుడు ఎటువంటి వైఖరిని అవలంబించింది ? మతాంతరీకరణ చెందిన వ్యక్తి ఆలోచన నుంచి, జీవితంలో నుంచి,కులం తప్పనిసరిగా తుడిచి పెట్టుకొని పోవాలన్న విషయాన్ని దృష్టిలోకి తీసు కొందా? మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ప్రొటెస్టెంట్ మిషనరీ వారు ఈ అంశాన్ని సానుకూలంగా సమర్ధించినట్లు లేదు. మిషనరీలు కులం పట్ల చూపిన అసహన వైఖరిని గురించి డాక్టర్ హైన్ 1814 లో రాసినాడు.

   "హిందువులలో పేరుకుపోయిన రాజకీయ విభజన ఏ విధంగాను మత ఉనికి సంబంధించినదిగా ఉండేటటువంటి కాదు అయితే చాలామంది జ్ఞానులు అనుకున్నవారు ఈ సంబంధం ఉన్నది అనుకుంటారు. హిందువులకు క్రైస్తవాన్ని అందించే ముందు వారి కులాన్ని ఉంచుకోవటానికి అనుమతిస్తే ఎటువంటి ఊగిసలాట లేకుండా మతాంతరీకరణ కు పెద్ద సంఖ్యలో ఒప్పుకుంటారు"

   ఒకవ్యక్తి ఉటంకించిన ఈ వ్యాఖ్యల ఆధారంగా గా మొత్తం ప్రొటెస్టెంట్ మిషనరీ వైఖరిని నిర్వచించ లేము. అయితే ఈ ముఖ్యమైన విషయంపై ప్రొటెస్టెంట్ మిషనరీ దీర్ఘంగా ఆలోచించిందనే దానికి చెప్పడానికి సందర్భాలు కూడా ఉన్నాయి. కలకత్తా బిషప్ గా 1823లో నియమితులైన రెవరెండ్ హెబర్ పదవికాలంలో ఈ అంశంపై లోతుగా చర్చించబడింది. పదవికాలంలోఆయన భారతదేశాన్ని,శ్రీలంకను సందర్శించారు. ఈ పర్యటనా సందర్భంలోమతాంతరీకరణ కు ప్రాతిపదికగా పట్టించుకునే అంశంపై ప్రొటెస్టెంట్ లలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా ఆయన గమనించి వాటిని పరిష్కరించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ పరిష్కార క్రమాన్ని శ్రీ కేయీ భావగర్భితంగా ఈ రకంగా వివరిస్తాడు.

చాలా వేగంగా వృద్దిచెందాలని, అత్యున్నతంగా విజయం సాధించాలనే దృష్టితో మిషనరీలు కొన్ని తప్పటడుగులు వేసే విధంగా వలలో పడ్డారు. ఒక హిందువును మతాంతీకరణ చేసే ముందు అతను తన కులాన్ని విడనాడాలని చెపుతారు.ఇది భారతదేశంలో హేయమైన చర్య. ఈ హేయ స్వభావమే మతాంతీకరణకు శకివంతమైన ప్రతిభందకమౌతుంది. మిషనరీలలో కులంపై పొడసూపిన భేదాభిప్రాయాలను పరిష్కరించాలని హేబర్ ఆకాంక్ష పడ్డాడు.


         హెబర్ బిషప్ కాలేజిలో పనిచేసే క్రిస్టియన్ డేవిడ్ అనే వ్యక్తి ద్వారా స్థానిక క్రైస్తవ మాతాంతరీకులకు  కొన్ని ప్రశ్నల ను పంపి సర్వే నిర్వహించారు.ఆ సర్వే ద్వారా క్రిస్టియన్ డేవిడ్ గారు వెల్లడించించిన అభిప్రాయం ఏమిటంటే, 
          దక్షిణ భారతదేశంలోని స్థానికుల మధ్య "కులం యదార్థంగా ఒక ప్రాపంచిక భావన.అది ఏ రకంగాను వాస్తవికమైన లేక అవాస్తవికమైన మతానికి సంభందించిన మేధో దృష్టి కాదు" ఉన్నత కులాల వారు దిగువ కులాల వారితో అన్యోన్య సంభందాలను కలిగి ఉండటానికి చూపే విముఖత ఏ మతపరమైన, మూఢాచారాల ప్రాతిపదికపైన ఆధారపడినది కాదు. అది పూర్తిగా సామాజిక కారాణల వల్లనే ఉంట్టుంది. ప్రాపంచింక సంపద ఆధారంగానో, ఆదర్శ సంభదమైన మార్గాల పరంగానో ఈ తేడాలు కొనసాగలేదు. క్రిస్టియన్ డేవిడ్ ప్రకారం దిగువ కులాలు తరచుగా అగ్రమనోభావాలకు ధిక్కారం కలిగించే రీతిలో భవ వ్యక్తీకరణం చేయడం వల దూకుడుగా, స్వీయగౌరవాన్ని కలిగి ఉండే విధంగా దిగువ కులాలు ఉండటం వల్ల పరస్పర తేడాలు ఉన్నాయని ఈయన భావించాడు.


జ్ణాన సంపాదన వారిని ఉన్నతీకరిస్తుందని,పరయ్యా జ్ణాన సముపార్జన చేసుకున్నట్లైతే పరియా పండితుడుగా గుర్తించబడి గౌరవించబడతాడని,తనతోటి సహోదరులతో కలసి పోవడానికి సుముఖత వ్యక్తం చేస్తారని,అయితే ప్రాపంచిక భయం వల్లనో,గర్వం వల్లనో ఒకే పాత్రలో ఉన్న ఆహారాన్ని కలసి భుజించటానికి ఇష్టపడరని క్రిస్టియన్ డేవిడ్ తెలిపినాడు.


"జీగెన్ బాల్గ్ రాజుల కాలం నాటి నుండి చర్చిలో ఒకే చోట కూర్చోకుండా రెండు భాగాలుగా చీలి వేర్వేరు చోట్లల్లో కూర్చుండేవారు. వేర్వేరుగా ఉండి ప్రభువును ధ్యానింస్తూండే వారు.త్రాగే నీటి కప్పును కూడా ముందు అగ్రవర్గాల వారు వాడిన పిదపే మిగతా వారు ఉపయోగించే వారు. అయితే ఇవన్నీ ప్రాపంచిక విభజనలు మాత్రమేనని, దక్షిణభారత క్రైస్తవ సంఘాలలోని వారి శ్మశాన వాటిక ఒక్కటేనని,చనిపోయిన వారిని ఒకే స్థితి లో బొందపెట్టేవారని,అంత్యక్రియల సమావేశంలో మిగతా క్రైస్తవేతర సంధర్భాలకు భిన్నంగా అన్ని తేడాలను మరచ పాల్గొంటారని క్రిస్టియన్ డేవిడ్ తెలిపినాడు.

కనీస సగటు ప్రయత్నాల వల్ల , ఓపికగా ఒప్పించే పద్దతులను అవలంబించడంతో చట్ట కఠినత్వంలో క్రైస్తవానికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా స్క్వార్జ్ క్రైస్తవ మిషనరీల
వంటి వారు తమ పాలనద్వార విభాజితమై ఉన్న తేడాలను అధిగమించగలిగారని క్రిస్టియన్ డేవిడ్ తెలిపినాడు.

       కాని చర్చ్ ఆఫ్ మిషనరీ ఆఫ్ సొసైటికి చెందిన రేనియస్ భిన్నమైన ఆలోచనలను వ్యక్తీకరించినాడు. ఎంత నామ మాత్రపు సామాజిక అంశమైనా కూడా "పూర్తి కుల నిర్మూలన" అవశ్యమైనదని రేనియస్ తెలిపినాడు. కుల విస్మరణ క్రైస్తవ చర్చ్ లోని ప్రవేశానికి కావలసిన మూలమైన ప్రతిపాదికయని ,పూర్వ మిషనరీలు అవలంబిస్తున్న వైఖరిని దుయ్యబట్టి అని "పవిత్ర గాస్పేల్ ను బ్రష్టు పట్టించే " శక్తులుగా రేనియస్ తెలిపినాడు.ఈ భావాలే అనేకమంది యువ మత ప్రచారకులలో ప్రాశస్త్యాన్ని పొందినాయి.

         హెబర్ పూర్తి సమాచారం సేకరించేదాక,క్షేత్ర స్థాయి నుంచి లభ్యమయ్యే నిష్పాక్షిక అంచనా లభ్యమయ్యే దాక అంతిమ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని వాయిదా వేశాడు. ఆయన దక్షిణ భారతదేశాన్ని పర్యటించే కార్యక్రమం ముందు క్రిస్టీన్ నాలేడ్జ్ సొసైటి తరపున "కులాన్ని" ఒక అంశంగా అధ్యయనం చేయడానికి,ఒక సెలెక్షన్ కమిటిని నియామకం చేశాడు. రెవెరెండ్ డి. స్కెరివోగల్ కు రాసిన ఉత్తరం లో ఉటంకించిన ప్రశ్నలను పరిశీలిస్తే కులం అంశంపై ఈయన అభిప్రాయాలను అర్థం చేసుకోవచ్చు

      కోస్తా ప్రాంతంలోని క్రైస్తవుల మధ్య "కుల ప్రభావం" కొనసాగుతుందని, ఒక సంస్థగా కులం వాస్తవంలో క్రైస్తవదేశాలలో కొనసాగే సామాజిక మినహాయింపు వాదనకి సమీపంగా ఉండే లక్షణమని, యురోప్ లో కులం లాంటిదేది లేదా? అమెరికాలో కులం లాంటిదేది లేదా? మన ఆంగ్ల చర్చ్ లలో ఇప్పటికి ఉన్నత వర్గం వారు, దిగువ వర్గం వారు వేర్వేరుగా కూర్చోవడం లేదా? బాగా వస్రాధారణ చేసుకొన్న వారు ముందుగా ప్రభు ప్రార్ధనకు చర్చిలలో సంసిద్దం కారా? ఉన్నత స్థాయి,దిగువ స్థాయి వారు ఒకే దగ్గర కూర్చొని భుజించగలరా? వారి పిల్లలు ఒకే పాఠశాలలో చదువగలరా? అన్ని నాగరిక దేశాలలో కూడా తేడలతో కూడుకొన్న విభాజ్య సంస్థలు,కుల మాదిరి తేడాలు కనిపించవూ? స్పానిష్ దేశస్థుడు తన కులాన్ని తెల్పే విధంగా వస్రాధారణ శైలి ఉండదా? సంపన్నుడైన మూలాటో,పేదరికపు శ్వేత మూలాటోకు స్నేహ పాత్రతకు అర్హమౌవుతాడా? ఏదైనా ఒక అంశానికి సంబందించిన పూర్తి సారుప్యత వేరోక అంశంలో కనిపించదు.


    దేవుని దృష్టిలో ప్రజలందరు సమానులేనన్న క్రైస్తవ మత సూత్రం అభినందించదగ్గది. కాని అదే స్థాయిలో ఖచ్చితమైన వాస్తవమేమిటంటే మానవుని దృష్టిలో అందరు సమానులు కారు. అంతేకాదు దేవుడు, మనుషులందరు సమానులుగా ఉండటాన్ని ఉద్దేశ పడ్డాడన్నది కూడా ఒక స్వచ్చమైన ఊహ మాత్రమే! సమాజ తేడాలు అన్ని చోట్లా ఉన్నాయి. ఇంకా వాదిస్తే, బ్రిటిష్ దృష్టిలో దక్షిణ భారతదేశంలోని క్రైస్తవుల మధ్య కొనసాగుతున్న తేడాలు సామాజికమే. అటువంటప్పుడు భిన్న మానవులలో వార్గాలలో లేని "సమానత్వ సూత్రాన్ని" అమలు పరిచే ప్రయత్నాల వల్ల చేపట్టిన మతాంతీకరణ చర్యలు భంగపడడం సమంజసమేనా?

   బిషప్ హెబర్ తన సమంజసమైన ఆలోచనతో ముందే ఒక అంశాన్ని తెలిపినాడు. క్రైస్తవ మత లక్ష్యం కోసం తాను ఆధునికుడుగా పనిచేయ్యాలని నిర్ణయించుకొన్నానని,పేరుకొని పోతున్న అమితోత్షాహపు స్వభావాన్ని కనిష్టికరించి సంయమన రీతిలో వ్యవహరించే ఏ ముఖ్య మిషనరి సాధించినట్లే లక్ష్యాల్ని సాధించగలమని భావించాడు. అటువంటి దృష్టితోనే క్రొత్త సీసాలో పాత సారా నింపడాన్ని వ్యతిరేకిస్తున్న వారి వైపు అధికారాన్ని,ఆమోదాన్ని తెలిపినాడు."

     ఇదే అభిప్రాయాన్ని 1841లో భారతదేశంలోని మచిలీపట్నంలో చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ మిషిన్ వర్క్స్ తరపున వచ్చిన ప్రొటెస్టెంట్ మిషనరీ రెవరెండ్ రాబర్ట్ నోబుల్ వ్యక్త పరిచాడు. కావాలని , ఒక పద్ధతి ప్రకారంగా మిషనరీ స్థాపించిన పాఠశాలలో పరియాల, పాకి పనివారల, చర్మకారుల కుటుంబాల వారిని మినహాయించాడు. పాఠశాలల్లో కుల ప్రవృత్తిని ప్రవేశ పెడుతున్నారన్న అభిశంసన కు ఈ క్రింది విధంగా జవాబిచ్చాడు." అతి దయార్ద్రమైన , మర్యాద పూర్వకమైన ఇంగ్లాండు తల్లిదండ్రులు కూడా తన కొడుకులను, తన సేవకుల బిడ్డలతో పాటుగా విద్య నేర్పించడానికి ఇష్టపడరు. నిజానికి గ్రామంలో ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి నేను అప్పుడప్పుడు దొంగతనంగా పోయిన నేరానికి తరచుగా నా తండ్రిచే శిక్షింపడేవాడిని. ఉన్నతంగా శిక్షణ గడప బడ్డ క్రైస్తవ కుటుంబాలలోని పిల్లలు, సేవకుల పిల్లలతో కలసి మాట్లాడడాన్ని, వారు ఎప్పుడు కూడా అనుమతించే వారు కారు. నా తల్లిదండ్రులు సేవకుల పిల్లలతో కలసి తిరగడానికి అనుమతించేవారు కారు. అట్లాగే పవిత్ర క్రైస్తవ బోధనలను వచ్చేటప్పుడు విధిగా పరియా,ఊడ్చే వారితో పాటుగా బ్రాహ్మణులు కూడా కూర్చోవాలని షరతు నా మటుకు అర్థం లేనిదిగాను, క్రైస్తవేతర మైనదిగాను అనిపిస్తుంది."

   హెబర్ కాలంనాటి నుండి కూడా వివేచనా పరులైన క్రైస్తవులనేకులు హెబర్ అనుసరించిన వైఖరి మొత్తంగా తప్పుగా భావించేవారు. తదనంతర కాలంలో బిషప్ విల్సన్ ఒకప్పటి తన పూర్వ నిర్ణయానికి భిన్నమైన వైఖరితో, కులపరమైన అసమానతలపై సహన దృష్టిని అవలంబించడానికి వ్యతిరేకించాడు దానికి కారణంగా కులం హిందూమతంలో అంతర్లీనమైన భాగమని తెలిపినాడు. కులం పైన ఉన్న ఈ దృక్పథమే భారతదేశం క్రైస్తవంలో ప్రొటెస్టెంట్ మిషన్స్ కు ఉన్న అధికార పరమైన సాధారణమైన అవగాహనగా కొనసాగుతూ వచ్చింది.


   ఈ విధంగా అన్ని మిషనరీలు క్రైస్తవాన్ని వ్యాపించే విధంగా సరళతరం చేయాలని అంగీకరించాయి. ఈ అంశంపైన కాథలిక్కులు, లూథరన్ లు, ప్రొటెస్టెంట్ ల మధ్య తేడా ఉంది. ఈ తేడా డిగ్రీ లోనే ఉంది. మతాంతరీకరణ చేసుకున్న క్రైస్తవులలో కులం రూపాల ఉనికి ఉన్నదంటే అది క్రైస్తవాన్ని సరళతరం చేసి వ్యాపింప చేయాలన్న విధానంలోనే ఉన్నది. ఈ విధానాన్ని అవలంబించడం వల్ల వచ్చే పరిణామాలను క్రైస్తవ మిషనరీలు ఊహించలేదు. "కులాన్ని తొలగించ లేని క్రైస్తవం వల్ల హిందువుకు ఒరిగేదేమిటి? " అనే ప్రశ్న ఒకనాడైనా ఎదురవుతుందనే విషయాన్ని మిషనరీలు విస్మరించాయి. వారు తమ లక్ష్యాన్ని ఒకరిని క్రైస్తవుడిగా చేసినందువల్ల క్రీస్తు అనుసరికుడవుతాడని తప్పుగా అర్థం చేసుకున్నారు.




18.
          అయితే అమెరికన్ ప్రొటేస్టేంట్ మిషనరీలు దీనికి మినహాయింపు. 1847 జులైలో వారు ఈ తీర్మానం చేశారు. " ఈ మిషను కులాన్ని ఒక అన్యమతపు మౌళిక లక్ష్యణంగా భావిస్తుంది. సరైన భోధన తరువాత దీనిని పూర్తిగా ఆచరణలో తిరస్కరించడం దైవభక్తికి సంత్రుప్తికరమైన చిహ్నంగా పరిగణిస్తుంది. సరియైన పరిస్థితులలో అన్నికులాల క్రైస్తవులతోనూ కలసి సహపంక్తి భోజనం చేసేందుకు సిద్దపడడం కులాన్ని వదులుకోవడానికి ఒక కనీస అర్థం.  
An exception must however be made in favour of the Protestant Missionaries of America. In July 1847 the American Missionaries passed the following resolution regarding this question
      That the Mission regards caste as an essential part of heathenism, and its full and practical renunciation, after instruction, as essential to satisfactory evidence of piety: and that renunciation of caste implies at least readiness to eat. under proper circumstances, with Christians of any caste.