Tuesday, 5 November 2019

కులాన్ని తొలగించలేని క్రైస్తవుల వల్ల హిందువులకు ఒరిగిందేమిటి? PAGE 587 -591

1813 తర్వాత ట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం మిషనరీల కార్యకలాపాలను అనుమతించిన ప్పుడు ఎటువంటి వైఖరిని అవలంబించింది ? మతాంతరీకరణ చెందిన వ్యక్తి ఆలోచన నుంచి, జీవితంలో నుంచి,కులం తప్పనిసరిగా తుడిచి పెట్టుకొని పోవాలన్న విషయాన్ని దృష్టిలోకి తీసు కొందా? మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ప్రొటెస్టెంట్ మిషనరీ వారు ఈ అంశాన్ని సానుకూలంగా సమర్ధించినట్లు లేదు. మిషనరీలు కులం పట్ల చూపిన అసహన వైఖరిని గురించి డాక్టర్ హైన్ 1814 లో రాసినాడు.

   "హిందువులలో పేరుకుపోయిన రాజకీయ విభజన ఏ విధంగాను మత ఉనికి సంబంధించినదిగా ఉండేటటువంటి కాదు అయితే చాలామంది జ్ఞానులు అనుకున్నవారు ఈ సంబంధం ఉన్నది అనుకుంటారు. హిందువులకు క్రైస్తవాన్ని అందించే ముందు వారి కులాన్ని ఉంచుకోవటానికి అనుమతిస్తే ఎటువంటి ఊగిసలాట లేకుండా మతాంతరీకరణ కు పెద్ద సంఖ్యలో ఒప్పుకుంటారు"

   ఒకవ్యక్తి ఉటంకించిన ఈ వ్యాఖ్యల ఆధారంగా గా మొత్తం ప్రొటెస్టెంట్ మిషనరీ వైఖరిని నిర్వచించ లేము. అయితే ఈ ముఖ్యమైన విషయంపై ప్రొటెస్టెంట్ మిషనరీ దీర్ఘంగా ఆలోచించిందనే దానికి చెప్పడానికి సందర్భాలు కూడా ఉన్నాయి. కలకత్తా బిషప్ గా 1823లో నియమితులైన రెవరెండ్ హెబర్ పదవికాలంలో ఈ అంశంపై లోతుగా చర్చించబడింది. పదవికాలంలోఆయన భారతదేశాన్ని,శ్రీలంకను సందర్శించారు. ఈ పర్యటనా సందర్భంలోమతాంతరీకరణ కు ప్రాతిపదికగా పట్టించుకునే అంశంపై ప్రొటెస్టెంట్ లలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా ఆయన గమనించి వాటిని పరిష్కరించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ పరిష్కార క్రమాన్ని శ్రీ కేయీ భావగర్భితంగా ఈ రకంగా వివరిస్తాడు.

చాలా వేగంగా వృద్దిచెందాలని, అత్యున్నతంగా విజయం సాధించాలనే దృష్టితో మిషనరీలు కొన్ని తప్పటడుగులు వేసే విధంగా వలలో పడ్డారు. ఒక హిందువును మతాంతీకరణ చేసే ముందు అతను తన కులాన్ని విడనాడాలని చెపుతారు.ఇది భారతదేశంలో హేయమైన చర్య. ఈ హేయ స్వభావమే మతాంతీకరణకు శకివంతమైన ప్రతిభందకమౌతుంది. మిషనరీలలో కులంపై పొడసూపిన భేదాభిప్రాయాలను పరిష్కరించాలని హేబర్ ఆకాంక్ష పడ్డాడు.


         హెబర్ బిషప్ కాలేజిలో పనిచేసే క్రిస్టియన్ డేవిడ్ అనే వ్యక్తి ద్వారా స్థానిక క్రైస్తవ మాతాంతరీకులకు  కొన్ని ప్రశ్నల ను పంపి సర్వే నిర్వహించారు.ఆ సర్వే ద్వారా క్రిస్టియన్ డేవిడ్ గారు వెల్లడించించిన అభిప్రాయం ఏమిటంటే, 
          దక్షిణ భారతదేశంలోని స్థానికుల మధ్య "కులం యదార్థంగా ఒక ప్రాపంచిక భావన.అది ఏ రకంగాను వాస్తవికమైన లేక అవాస్తవికమైన మతానికి సంభందించిన మేధో దృష్టి కాదు" ఉన్నత కులాల వారు దిగువ కులాల వారితో అన్యోన్య సంభందాలను కలిగి ఉండటానికి చూపే విముఖత ఏ మతపరమైన, మూఢాచారాల ప్రాతిపదికపైన ఆధారపడినది కాదు. అది పూర్తిగా సామాజిక కారాణల వల్లనే ఉంట్టుంది. ప్రాపంచింక సంపద ఆధారంగానో, ఆదర్శ సంభదమైన మార్గాల పరంగానో ఈ తేడాలు కొనసాగలేదు. క్రిస్టియన్ డేవిడ్ ప్రకారం దిగువ కులాలు తరచుగా అగ్రమనోభావాలకు ధిక్కారం కలిగించే రీతిలో భవ వ్యక్తీకరణం చేయడం వల దూకుడుగా, స్వీయగౌరవాన్ని కలిగి ఉండే విధంగా దిగువ కులాలు ఉండటం వల్ల పరస్పర తేడాలు ఉన్నాయని ఈయన భావించాడు.


జ్ణాన సంపాదన వారిని ఉన్నతీకరిస్తుందని,పరయ్యా జ్ణాన సముపార్జన చేసుకున్నట్లైతే పరియా పండితుడుగా గుర్తించబడి గౌరవించబడతాడని,తనతోటి సహోదరులతో కలసి పోవడానికి సుముఖత వ్యక్తం చేస్తారని,అయితే ప్రాపంచిక భయం వల్లనో,గర్వం వల్లనో ఒకే పాత్రలో ఉన్న ఆహారాన్ని కలసి భుజించటానికి ఇష్టపడరని క్రిస్టియన్ డేవిడ్ తెలిపినాడు.


"జీగెన్ బాల్గ్ రాజుల కాలం నాటి నుండి చర్చిలో ఒకే చోట కూర్చోకుండా రెండు భాగాలుగా చీలి వేర్వేరు చోట్లల్లో కూర్చుండేవారు. వేర్వేరుగా ఉండి ప్రభువును ధ్యానింస్తూండే వారు.త్రాగే నీటి కప్పును కూడా ముందు అగ్రవర్గాల వారు వాడిన పిదపే మిగతా వారు ఉపయోగించే వారు. అయితే ఇవన్నీ ప్రాపంచిక విభజనలు మాత్రమేనని, దక్షిణభారత క్రైస్తవ సంఘాలలోని వారి శ్మశాన వాటిక ఒక్కటేనని,చనిపోయిన వారిని ఒకే స్థితి లో బొందపెట్టేవారని,అంత్యక్రియల సమావేశంలో మిగతా క్రైస్తవేతర సంధర్భాలకు భిన్నంగా అన్ని తేడాలను మరచ పాల్గొంటారని క్రిస్టియన్ డేవిడ్ తెలిపినాడు.

కనీస సగటు ప్రయత్నాల వల్ల , ఓపికగా ఒప్పించే పద్దతులను అవలంబించడంతో చట్ట కఠినత్వంలో క్రైస్తవానికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా స్క్వార్జ్ క్రైస్తవ మిషనరీల
వంటి వారు తమ పాలనద్వార విభాజితమై ఉన్న తేడాలను అధిగమించగలిగారని క్రిస్టియన్ డేవిడ్ తెలిపినాడు.

       కాని చర్చ్ ఆఫ్ మిషనరీ ఆఫ్ సొసైటికి చెందిన రేనియస్ భిన్నమైన ఆలోచనలను వ్యక్తీకరించినాడు. ఎంత నామ మాత్రపు సామాజిక అంశమైనా కూడా "పూర్తి కుల నిర్మూలన" అవశ్యమైనదని రేనియస్ తెలిపినాడు. కుల విస్మరణ క్రైస్తవ చర్చ్ లోని ప్రవేశానికి కావలసిన మూలమైన ప్రతిపాదికయని ,పూర్వ మిషనరీలు అవలంబిస్తున్న వైఖరిని దుయ్యబట్టి అని "పవిత్ర గాస్పేల్ ను బ్రష్టు పట్టించే " శక్తులుగా రేనియస్ తెలిపినాడు.ఈ భావాలే అనేకమంది యువ మత ప్రచారకులలో ప్రాశస్త్యాన్ని పొందినాయి.

         హెబర్ పూర్తి సమాచారం సేకరించేదాక,క్షేత్ర స్థాయి నుంచి లభ్యమయ్యే నిష్పాక్షిక అంచనా లభ్యమయ్యే దాక అంతిమ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని వాయిదా వేశాడు. ఆయన దక్షిణ భారతదేశాన్ని పర్యటించే కార్యక్రమం ముందు క్రిస్టీన్ నాలేడ్జ్ సొసైటి తరపున "కులాన్ని" ఒక అంశంగా అధ్యయనం చేయడానికి,ఒక సెలెక్షన్ కమిటిని నియామకం చేశాడు. రెవెరెండ్ డి. స్కెరివోగల్ కు రాసిన ఉత్తరం లో ఉటంకించిన ప్రశ్నలను పరిశీలిస్తే కులం అంశంపై ఈయన అభిప్రాయాలను అర్థం చేసుకోవచ్చు

      కోస్తా ప్రాంతంలోని క్రైస్తవుల మధ్య "కుల ప్రభావం" కొనసాగుతుందని, ఒక సంస్థగా కులం వాస్తవంలో క్రైస్తవదేశాలలో కొనసాగే సామాజిక మినహాయింపు వాదనకి సమీపంగా ఉండే లక్షణమని, యురోప్ లో కులం లాంటిదేది లేదా? అమెరికాలో కులం లాంటిదేది లేదా? మన ఆంగ్ల చర్చ్ లలో ఇప్పటికి ఉన్నత వర్గం వారు, దిగువ వర్గం వారు వేర్వేరుగా కూర్చోవడం లేదా? బాగా వస్రాధారణ చేసుకొన్న వారు ముందుగా ప్రభు ప్రార్ధనకు చర్చిలలో సంసిద్దం కారా? ఉన్నత స్థాయి,దిగువ స్థాయి వారు ఒకే దగ్గర కూర్చొని భుజించగలరా? వారి పిల్లలు ఒకే పాఠశాలలో చదువగలరా? అన్ని నాగరిక దేశాలలో కూడా తేడలతో కూడుకొన్న విభాజ్య సంస్థలు,కుల మాదిరి తేడాలు కనిపించవూ? స్పానిష్ దేశస్థుడు తన కులాన్ని తెల్పే విధంగా వస్రాధారణ శైలి ఉండదా? సంపన్నుడైన మూలాటో,పేదరికపు శ్వేత మూలాటోకు స్నేహ పాత్రతకు అర్హమౌవుతాడా? ఏదైనా ఒక అంశానికి సంబందించిన పూర్తి సారుప్యత వేరోక అంశంలో కనిపించదు.


    దేవుని దృష్టిలో ప్రజలందరు సమానులేనన్న క్రైస్తవ మత సూత్రం అభినందించదగ్గది. కాని అదే స్థాయిలో ఖచ్చితమైన వాస్తవమేమిటంటే మానవుని దృష్టిలో అందరు సమానులు కారు. అంతేకాదు దేవుడు, మనుషులందరు సమానులుగా ఉండటాన్ని ఉద్దేశ పడ్డాడన్నది కూడా ఒక స్వచ్చమైన ఊహ మాత్రమే! సమాజ తేడాలు అన్ని చోట్లా ఉన్నాయి. ఇంకా వాదిస్తే, బ్రిటిష్ దృష్టిలో దక్షిణ భారతదేశంలోని క్రైస్తవుల మధ్య కొనసాగుతున్న తేడాలు సామాజికమే. అటువంటప్పుడు భిన్న మానవులలో వార్గాలలో లేని "సమానత్వ సూత్రాన్ని" అమలు పరిచే ప్రయత్నాల వల్ల చేపట్టిన మతాంతీకరణ చర్యలు భంగపడడం సమంజసమేనా?

   బిషప్ హెబర్ తన సమంజసమైన ఆలోచనతో ముందే ఒక అంశాన్ని తెలిపినాడు. క్రైస్తవ మత లక్ష్యం కోసం తాను ఆధునికుడుగా పనిచేయ్యాలని నిర్ణయించుకొన్నానని,పేరుకొని పోతున్న అమితోత్షాహపు స్వభావాన్ని కనిష్టికరించి సంయమన రీతిలో వ్యవహరించే ఏ ముఖ్య మిషనరి సాధించినట్లే లక్ష్యాల్ని సాధించగలమని భావించాడు. అటువంటి దృష్టితోనే క్రొత్త సీసాలో పాత సారా నింపడాన్ని వ్యతిరేకిస్తున్న వారి వైపు అధికారాన్ని,ఆమోదాన్ని తెలిపినాడు."

     ఇదే అభిప్రాయాన్ని 1841లో భారతదేశంలోని మచిలీపట్నంలో చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ మిషిన్ వర్క్స్ తరపున వచ్చిన ప్రొటెస్టెంట్ మిషనరీ రెవరెండ్ రాబర్ట్ నోబుల్ వ్యక్త పరిచాడు. కావాలని , ఒక పద్ధతి ప్రకారంగా మిషనరీ స్థాపించిన పాఠశాలలో పరియాల, పాకి పనివారల, చర్మకారుల కుటుంబాల వారిని మినహాయించాడు. పాఠశాలల్లో కుల ప్రవృత్తిని ప్రవేశ పెడుతున్నారన్న అభిశంసన కు ఈ క్రింది విధంగా జవాబిచ్చాడు." అతి దయార్ద్రమైన , మర్యాద పూర్వకమైన ఇంగ్లాండు తల్లిదండ్రులు కూడా తన కొడుకులను, తన సేవకుల బిడ్డలతో పాటుగా విద్య నేర్పించడానికి ఇష్టపడరు. నిజానికి గ్రామంలో ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి నేను అప్పుడప్పుడు దొంగతనంగా పోయిన నేరానికి తరచుగా నా తండ్రిచే శిక్షింపడేవాడిని. ఉన్నతంగా శిక్షణ గడప బడ్డ క్రైస్తవ కుటుంబాలలోని పిల్లలు, సేవకుల పిల్లలతో కలసి మాట్లాడడాన్ని, వారు ఎప్పుడు కూడా అనుమతించే వారు కారు. నా తల్లిదండ్రులు సేవకుల పిల్లలతో కలసి తిరగడానికి అనుమతించేవారు కారు. అట్లాగే పవిత్ర క్రైస్తవ బోధనలను వచ్చేటప్పుడు విధిగా పరియా,ఊడ్చే వారితో పాటుగా బ్రాహ్మణులు కూడా కూర్చోవాలని షరతు నా మటుకు అర్థం లేనిదిగాను, క్రైస్తవేతర మైనదిగాను అనిపిస్తుంది."

   హెబర్ కాలంనాటి నుండి కూడా వివేచనా పరులైన క్రైస్తవులనేకులు హెబర్ అనుసరించిన వైఖరి మొత్తంగా తప్పుగా భావించేవారు. తదనంతర కాలంలో బిషప్ విల్సన్ ఒకప్పటి తన పూర్వ నిర్ణయానికి భిన్నమైన వైఖరితో, కులపరమైన అసమానతలపై సహన దృష్టిని అవలంబించడానికి వ్యతిరేకించాడు దానికి కారణంగా కులం హిందూమతంలో అంతర్లీనమైన భాగమని తెలిపినాడు. కులం పైన ఉన్న ఈ దృక్పథమే భారతదేశం క్రైస్తవంలో ప్రొటెస్టెంట్ మిషన్స్ కు ఉన్న అధికార పరమైన సాధారణమైన అవగాహనగా కొనసాగుతూ వచ్చింది.


   ఈ విధంగా అన్ని మిషనరీలు క్రైస్తవాన్ని వ్యాపించే విధంగా సరళతరం చేయాలని అంగీకరించాయి. ఈ అంశంపైన కాథలిక్కులు, లూథరన్ లు, ప్రొటెస్టెంట్ ల మధ్య తేడా ఉంది. ఈ తేడా డిగ్రీ లోనే ఉంది. మతాంతరీకరణ చేసుకున్న క్రైస్తవులలో కులం రూపాల ఉనికి ఉన్నదంటే అది క్రైస్తవాన్ని సరళతరం చేసి వ్యాపింప చేయాలన్న విధానంలోనే ఉన్నది. ఈ విధానాన్ని అవలంబించడం వల్ల వచ్చే పరిణామాలను క్రైస్తవ మిషనరీలు ఊహించలేదు. "కులాన్ని తొలగించ లేని క్రైస్తవం వల్ల హిందువుకు ఒరిగేదేమిటి? " అనే ప్రశ్న ఒకనాడైనా ఎదురవుతుందనే విషయాన్ని మిషనరీలు విస్మరించాయి. వారు తమ లక్ష్యాన్ని ఒకరిని క్రైస్తవుడిగా చేసినందువల్ల క్రీస్తు అనుసరికుడవుతాడని తప్పుగా అర్థం చేసుకున్నారు.




18.
          అయితే అమెరికన్ ప్రొటేస్టేంట్ మిషనరీలు దీనికి మినహాయింపు. 1847 జులైలో వారు ఈ తీర్మానం చేశారు. " ఈ మిషను కులాన్ని ఒక అన్యమతపు మౌళిక లక్ష్యణంగా భావిస్తుంది. సరైన భోధన తరువాత దీనిని పూర్తిగా ఆచరణలో తిరస్కరించడం దైవభక్తికి సంత్రుప్తికరమైన చిహ్నంగా పరిగణిస్తుంది. సరియైన పరిస్థితులలో అన్నికులాల క్రైస్తవులతోనూ కలసి సహపంక్తి భోజనం చేసేందుకు సిద్దపడడం కులాన్ని వదులుకోవడానికి ఒక కనీస అర్థం.  
An exception must however be made in favour of the Protestant Missionaries of America. In July 1847 the American Missionaries passed the following resolution regarding this question
      That the Mission regards caste as an essential part of heathenism, and its full and practical renunciation, after instruction, as essential to satisfactory evidence of piety: and that renunciation of caste implies at least readiness to eat. under proper circumstances, with Christians of any caste.

No comments:

Post a Comment