Saturday, 9 February 2019

క్రైస్తవం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు.. పార్ట్2


(బాబాసాహెబ్ రచనలు ప్రసంఘాలు - సంపుటం 5, భాగం 4)

🔹 పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 569, 570, 571 🔹


విద్య, వైద్యం కార్యక్రమాల మీద, క్రైస్తవ మిషనరీలు ఖర్చుపెట్టిన సొమ్ము, చేసిన కృషి మొత్తము దుర్వినియోగం మరియు భారతీయ క్రైస్తవులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

భారతీయ క్రైస్తవుల రెండు నిజమైన అవసరాలు
- మొదటిది వారి, పౌర స్వచ్ఛను కాపాడుకోవడం...
- రెండవది వారి ఆర్ధిక వికాసానికి కావలసిన మార్గాలు, వనరులు..

ఈ అవసరాలను వివరణాత్మకంగా చర్చించకుండా, నన్ను నేను నిగ్రహించుకోలేను. అసలు క్రైస్తవ మిషినరీల సామాజిక కార్యక్రమాల్లో తప్పకుండా ఉండాల్సిన అవశ్యకతలేమిటో చెప్పాలనేది నా ఉద్దేశం.

క్రైస్తవ మిషనరీలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు
- క్రైస్తవంలోకి మారిన వ్యక్తియొక్క మనస్తత్వాన్ని మార్చడంలో క్రైస్తవం సాధించింది ఏమిటి..??
- (క్రైస్తవం ద్వారా) అస్పృష్య క్రైస్తవుడు, సవర్ణ హిందువు స్థాయికి చేర్చబడ్డాడా...??
- అస్పృష్య క్రైస్తవుడు, సవర్ణ క్రైస్తవుడు క్రైస్తవం స్వీకరించాక తమ కులాలను వదులుకున్నారా.....??
- వారు ముందు పాటించిన మతాల దేవుళ్లను ఆరాధించడం, మతాచారాలను పాటించడం మానివేశారా ..??


ఈ ప్రశ్నలకు క్రైస్తవం నుండి వచ్చే సమాధానాల మీదనే, క్రైస్తవము భారతదేశంలో కొనసాగబోవడమా లేక దెబ్బతింటామా అనే విషయం ఆధారపడి ఉంది..



సైమన్ కమిషన్ పర్యటన సందర్బంగా దక్షిణ భారతదేశ క్రైస్తవ వర్గాలు, వారి సామాజిక స్థితిగతుల మీద కుల సమస్య మీద సమర్పించిన వినతి పత్రంలోని ఈ సమాచారం, క్రైస్తవ మతంలోకి మారిన దళితుల స్థితిగతుల గురించి మరింత వివరంగా తెలుపుతుంది..


-*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*-


మతపరంగా మేము క్యాథలిక్కులమైనా, ప్రొటెస్టెంట్లము అయినా క్రైస్తవులము. ప్రెసిడెన్సీ పాలనలో ఉన్న భూభాగంలో నివసిస్తూ మతం మారినవాళ్ళలో 60% మంది అంటరాని కులాల నుండి వచ్చినవారే. మా భూభాగంలో ఎప్పుడైతే క్రైస్తవం ప్రకటింపబడిందో, అప్పటి నుండి, మేము ముఖ్యంగా, పల్లాలు, పరియాలు, మాలలు, మాదిగలు క్రైస్తవాన్ని ఆచరిస్తున్నవాళ్ళం. మా సంబంధికుల్లో ఎవరైతే ఇప్పటికి హిందూమతంలో భాగస్థులుగా ఉన్నారో వారు క్రైస్తవ మతంలోకి మారలేదు. ఏదేమైనా మేమే క్రైస్తవమతంలో మారినప్పటికీ, క్రైస్తవ ప్రధాన బోధనలైన దైవం ముందు అందరూ సమానమే, సాటి మనిషి పట్ల కారుణ్యాన్ని కలిగి ఉండడం, క్షమాగుణం, సానుభూతి కలిగి ఉండడం లాంటివి పాటిస్తున్నప్పటికీ మా జీవన పరిస్థితులు, మతం మారని హిందూ అంటరాని ప్రజల జీవన స్థితిగతులు ఒకేరకంగా ఉన్నాయి.

అనేక కారణాలు ఉన్నప్పటికీ, అన్నింటికంటే ముఖ్యమైన, మతమ్మారిన క్రైస్తవుల్లో కూడా పాతుకుపోయిన, కులాన్ని వదులుకోలేని హిందూ స్వభావం (Caste retaining Hindu Mentality) వలన, ఈ స్వభావం పట్ల క్రైస్తవ మత సంస్థల ఉదాసీనత వలన, మతం మారకముందు ఏ విధమైన స్థితిగతులు అనుభవించామో, ఇప్పుడూ అదే స్థాయిలో కొనసాగుతున్నాము. అంటరాని వారిగానే తోటి అగ్రకుల క్రైస్తవులచేత, అగ్రకుల హిందువుల చేత తిరస్కరించబడుతున్నాం. మరోవైపు ఏ సమాజికవర్గ పునాదుల నుండి వచ్చామో ఆ హిందూ అస్పృష్య సోదరుల నుండి కూడా వేరు చేయబడ్డాం.

దక్షిణ భారతదేశంలో మద్రాసులాంటి రాష్ట్రాల్లో చట్టసభల్లో క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతికొద్ది మంది కూడా అగ్రకుల క్రైస్తవులే. ఇది చాలా వైరుధ్యంగా కనిపించినప్పటికీ వంద శాతం వాస్తవం. హిందూ మతం నుండి వచ్చిన అగ్రకుల క్రైస్తవులు తమ తమ కులాల పోకడలను యధాతధంగా కొనసాగిస్తున్న వారే. వారు ఒకవైపు క్రైస్తవ మతాచారాలను పాటిస్తూ, సోదర క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కులవివక్షను, చాందస తీవ్రతను అవలంభిస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని "పంచములు లేదా పరియాలు" అని హేళన చేస్తూనే ఉన్నారు. తమకున్న ధనం, అధికారం, హోదాగర్వం, పదవులు లాంటి వాటి సహాయంతో అస్పృష్య క్రైస్తవులను మరింత వివక్షతకు గురి చేయడం వారికి పరిపాటిగా మారింది. వారు తరచుగా క్రైస్తవ జీవితంలోనే పంచమ వ్యతిరేక కార్యకలాపాలను యాదేచ్ఛగా పాల్పడే సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.

మా జీవితాలను బాగుచేసుకునేందుకు, మా పురోగతికోసం, ప్రాథమిక హక్కుల కోసం మేము చేసే ఏ ప్రయత్నం అయినా కూడా, జన్మతః అధికులము అని భావించే అగ్రకుల క్రైస్తవుల, హిందువుల ఈసడింపుకు గురికాబడుతోంది. క్రైస్తవ మౌలిక సూత్రాలైన విశ్వప్రేమ, సమానత్వం, కారుణ్యవాదానికి భిన్నంగా, "మా సోదర క్రైస్తవులు అని చెప్పబడుతున్నవారు" మమ్మల్ని నేటికీ చర్చీల్లో అంతరానివాళ్ళుగా, దగ్గరకు రానివ్వకూడని సముదాయాలుగానే పరిగణిస్తున్నారు. ప్రార్ధనా స్థలాలలో, చర్చీలలో ఇనుప బ్యారికేడ్లతో, ఫెన్సింగ్ మరియు వేర్వేరు రూపాలలో అడ్డుగోడలు నిర్మించి కొనసాగిస్తున్న సందర్భాలు అనేకం.

కలుషితం అనే నెపంతో మతకర్మలు పాటించే విషయంలో కూడా ఘోరమైన విభాజిత దృష్టి పాటించబడుతున్నది. క్రైస్తవ విద్యా సంస్థల ద్వారా మా పిల్లలను విద్యావంతులను చేసి, వారికి మంచి జీవితం అందించాలన్న మా తలంపు కూడా నిర్ధాక్షిణ్యంగా నిరాదరించబడుతున్నది... విద్యాసంస్థల్లో, హాస్టళ్లలో అనుమతి నిరాకరించబడుతున్నది. ఒకవేళ అనుమతి అందిన కూడా, అగ్రకుల క్రైస్తవులకు ప్రత్యేక వసతులు, అంటరాని కులాల క్రైస్తవులకు హీనమైన వసతులు ఇస్తూ వివక్షత చూపించడం సాధారణ అంశంగా మారింది.

తమ పూర్వపు హిందూ అగ్రకుల సారాన్ని తమలో ఇముడ్చుకుని, క్రైస్తవంలో కూడా తమకు ప్రత్యేక సామాజిక హోదా ఏర్పరచుకొని, హిందూ మతంలో ఉన్న తమ బంధువులతో సమానంగా పరిగణనలోకి రావాలని, క్రైస్తవములో ఉన్నప్పటికీ అంటరాని కులాల క్రైస్తవులకు, వీళ్ళు చిన్నచూపు చూస్తారు..

-*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*--*-*-*-*-*-*-


క్రైస్తవంలో ఈ రకమైన వివక్షా స్థితి అత్యంత దారుణమైనది...

🔹 పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 572, 573 🔹

మొత్తంగా, క్రైస్తవ మతలోకి మారినవారిలో కులదృష్టి తీసివేయడంలో క్రైస్తవ మతం విజయం సాధించలేకపోయింది. హిందువుల జీవితాలను ఈ మాదిరిగానైతే కులమే నియంత్రిస్తుందో, క్రైస్తవ జీవితాలను కూడా కులమే శాసిస్తోందని చెప్పడంలో నాకు ఏ దురుద్దేశము లేదు. క్రైస్తవ మతానికి మారినవాళ్ళలో బ్రాహ్మణ క్రైస్తవులు ఉన్నారు, బ్రాహ్మణేతర క్రైస్తవులు ఉన్నారు, బ్రహ్మణేతర క్రైస్తవుల్లో మళ్లీ, మరాఠా క్రైస్తవులు, మహార్ క్రైస్తవులు, మాంగ్ క్రైస్తవులు, భంగి క్రైస్తవులు, మాల క్రైస్తవులు, మాదిగ క్రైస్తవులు అని అనేక కులాలుగా ఉన్నారు. వీరిలో సహపంక్తి భోజనాలు ఉండవు. వివాహ బాంధవ్యాలను ఏర్పరుచుకోవడానికి ఇష్టపడరు. హిందువులలాగానే వీళ్ళు కూడా కుల పోకడలతో కొట్టుమిట్టాడుతున్నవారే.

క్రైస్తవ మతమార్పిడులు, క్రైస్తవం సఫలం కాకపోవడానికి కారణం మరొక విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. మత మార్పిడి చెందినప్పటికీ క్రైస్తవులు రకరకాల రూపాల్లో, పేర్లతో తమ పూర్వపు హిందూ సాంప్రదాయాలను, మూఢ విశ్వాసాలను పాటిస్తూ ఉండడం స్పష్టంగా చూడవచ్చు. చాలామంది వారి కుటుంబ దేవతతో పాటు, రాముడు కృష్ణుడు, విష్ణువు, శంకరుల అవతారాలను పూజిస్తూ కనిపిస్తారు. హిందూ పవిత్ర స్థలాలకు విహారాయాత్రల పేరుతో వెళ్లివస్తూ ఉంటారు. గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూడడానికి భయపడతారు. గ్రహణం రోజు సముద్రస్నానం చేయడం లాంటి ఆచారాలనూ పాటిస్తారు. ముహూర్తాలను, జాతకాలను నమ్ముతారు. దీపావళి, హోళీ లాంటి పండుగలను అందరితో కలిసి సంబరంగా జరుపుకుంటారు. ఇవన్నీ సమాజ సాంప్రదాయాలైతే ఇబ్బంది ఏమీ లేదుగానీ, ఇవ్వన్నీ హిందూ స్వభావంతో, మత ప్రభావం కోసం పాటించబడేవి. క్రైస్తవానికి మారినా కూడా వారిలో ఇంకా ఇలా హిందూ సాంప్రదాయాలు కొనసాగింపు చాలా దారుణమైన విషయం. ఈ సాంప్రదాయాలు నుండి క్రైస్తవం కూడా బయటపడలేకపోయింది.

క్రైస్తవంలోకీ మందిని మార్చాలనే తాపత్రయం మాత్రమే ఉన్న మిషనరీలు, ఈ హిందుత్వ సాంప్రదాయాలను, వాటి ప్రభావాన్ని తొలగించే ప్రయత్నం చేయకపోగా,, వాటిని సహిస్తూ, వాటిని ప్రోత్సహిస్తూ వచ్చారు.

🔹 పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 578, 579 🔹

క్రైస్తవ మత వ్యాప్తిని సరళతరం చేసి, తేలికగా మతమార్పిడులు చేయడానికి, హిందూ మతలో సున్నితమైన అంశాలకు భంగం కలిగించకుండా, హిందుత్వ మత ధోరనులెన్నింటినో కొనసాగించడాన్నీ, మిషనరీలు అలవాటు చేసుకున్నాయి.

అపరిమితమైన ఇలాంటి మినహాయింపులు లోబడి నామమాత్రంగా చేసే మతమార్పిడులు, సిగ్గుమాలినవే కాక, పాపాత్మకమైనవి కూడా. మతం మార్పిడి పొందిన వ్యక్తి యొక్క గత జీవన పరిస్తితులలు, ఆలోచనా ధోరణితో సంబంధం లేకుండా, హడావిడిగా కేవలం యేసును రక్షకుడిగా ప్రకటించేసి, క్రైస్తవీకరించడం సరైనది కాదు

Friday, 8 February 2019

#క్రైస్తవమతం_గురించి_బాబాసాహెబ్_అంబెడ్కర్

"బాబాసాహెబ్ కంటే ముందే కిరస్తానీ సంఘాల వల్ల దళితులందరికీ చదువు వచ్చింది, ఆర్ధికంగా ఎదిగారు" అని వాగితే, 

వాళ్ళ తాత ఏ డిగ్రీ చదివాడో, వాళ్ళ తాత   సంపాదించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, మొహమాటం లేకుండా అడగండి…

*****************************************************
క్రైస్తవం అస్పృశ్యులు ఎదగడానికి ఉపకరిస్తుందా అంటే,, సమాధానం ""లేదు"" అని చెప్పాల్సి ఉంటుంది.
- అంబేద్కర్ రచనలు ప్రసంఘాలు - సంపుటం 5, తెలుగు అకాడమీ అనువాదం 592
క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య, వైద్యంలో అందించబడిన సేవలు, భారతీయ క్రైస్తవులకు సమీపములో అందుబాటులో ఉండేవి కాదు.... వీరికంటే అవి ఎక్కువగా సవర్ణ హిందూ అగ్రకులస్థులకే ఎక్కువ లబ్ది చేకూర్చాయి.....
అస్పృష్య క్రైస్తవుల వికాసం అనే దృక్కోణంలో చూస్తే, క్రైస్తవ మిషనరీల ద్వారా నిర్వహించబడుతున్న, పాఠ్యశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు చేసిన ఖర్చు మొత్తం వృధాగా అస్పృష్యులకు ఉపయోగపడని రీతిలో చేయబడినది..... ఇదే విధంగా మిషనరీలు అందించిన వైద్య సహాయాలు కూడా హిందూ అగ్రకులకే ఉపయోగపడింది.... మరీ ముఖ్యంగా ఆసుపత్రుల వినియోగంలో ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం.
ఈ విషయం చాలా క్రైస్తవ మిస్సినరీలకు కూడా అర్ధం అయ్యి జరుగుతున్నదే..... క్రైస్తవ మెషినరీ కార్యక్రమాల వెనుక ఉన్న లక్ష్యం మిషనరీలతో హిందూ అగ్రకులాలకు సత్సంబంధాలు కల్పించడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు...
- బాబాసాహెబ్ అంబెడ్కర్ రచనలు ప్రసంగాలు, వాల్యూం 5, పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 567

క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య, వైద్యంలో అందించబడిన సేవలు, భారతీయ క్రైస్తవులకు సమీపములో అందుబాటులో ఉండేవి కాదు.... వీరికంటే అవి ఎక్కువగా సవర్ణ హిందూ అగ్రకులస్థులకే ఎక్కువ లబ్ది చేకూర్చాయి.....
అస్పృష్య క్రైస్తవుల వికాసం అనే దృక్కోణంలో చూస్తే, క్రైస్తవ మిషనరీల ద్వారా నిర్వహించబడుతున్న, పాఠ్యశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు చేసిన ఖర్చు మొత్తం వృధాగా అస్పృష్యులకు ఉపయోగపడని రీతిలో చేయబడినది..... ఇదే విధంగా మిషనరీలు అందించిన వైద్య సహాయాలు కూడా హిందూ అగ్రకులకే ఉపయోగపడింది.... మరీ ముఖ్యంగా ఆసుపత్రుల వినియోగంలో ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం.
ఈ విషయం చాలా క్రైస్తవ మిస్సినరీలకు కూడా అర్ధం అయ్యి జరుగుతున్నదే..... క్రైస్తవ మెషినరీ కార్యక్రమాల వెనుక ఉన్న లక్ష్యం మిషనరీలతో హిందూ అగ్రకులాలకు సత్సంబంధాలు కల్పించడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు...
- బాబాసాహెబ్ అంబెడ్కర్ రచనలు ప్రసంగాలు, వాల్యూం 5, పేజీలు - తెలుగు అకాడమీ అనువాదం - 567

***********************



Wednesday, 6 February 2019

క్రైస్తవ వృద్దిని నిరోధించిన మూడు అంశాలు....

బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి 5th volume page no 536 to 556

1... భారతదేశంలో స్థిరపడిన యూరోపియన్ల నీతిమాలినతనం, అవినీతి విశృంఖలత్వం
( మిస్టర్ కాయో రచించిన Christianity in India లో చూడవచ్చు )

2... మత స్వీకరణ క్షేత్రములో ఆధిక్యత కోసం కేథలిక్కులకు, కేథలిక్కేతరులకు మధ్య తగాదాలు.

👉 కేథలిక్కులకు ముందు భారత దేశంలో గల సిరియన్ క్రైస్తవులు పితృస్వామ్యానికి ప్రతీక.
విగ్రహారాధన విషయంలో పోర్చుగీసు కేథలిక్ చర్చిలు సిరియన్ చర్చిల ముందు నిందలపాలయ్యాయి.

👉 సిరియన్ క్రైస్తవులు సువార్త ప్రకటనల ద్వారా మత ప్రచారం చేసేవారు. రోమన్ కేథలిక్స్ విశ్వాసం ఆధారంగా మత ప్రచారం చేసేవారు.

3.. క్రైస్తవ మత ప్రచారంలో గల తప్పుడు పద్దతులు.

👉 మొదట మిషనరీలు బ్రాహ్మణులను మత మార్పిడి చేస్తే మిగతా అన్ని భారతీయ కులాలు క్రైస్తవ మతంలోకి వస్తాయని భావించారు.

👉 బ్రాహ్మణుల హిందూ మతం చెడ్డదని నిరూపించడానికి ప్రయత్నం చేశారు.

బ్రాహ్మణుల మరియు హిందువులలోని ఉన్నత కులాల కోసం పాఠశాలలు, కళాశాలలు వైద్యశాలలు స్థాపించారు .

ఈ సంస్థల నుండి బ్రాహ్మణులు మరియు సంపన్న వర్గాలు బాగా లాభాలు పొందాయి.

### #### ###
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత క్రైస్తవ మతాన్ని అస్పృశ్య వర్గాలు చేరుకున్నాయి .అప్పటి నుండి క్రైస్తవ మతం భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందడం మొదలైంది

Ambedkar : Caste System in Christianity


DR. BABASAHEB AMBEDKAR : WRITINGS AND SPEECHES Vol5 Page No 454-456
You can down load VOL 5 book by clicking below link
http://www.mea.gov.in/Images/attach/amb/Volume_05.pdf

*******************************************
The following extracts taken from the memorandum submitted by the Christian Depressed Classes of South India to the Simon Commission throw a flood of light on the position of the Untouchables who have gone into the Christian fold so far as the question of caste is concerned.

“We are by religion Christians, both Roman Catholics and Protestants. Of the total population of Indian Christians of the Presidency the converts from the Depressed Classes form about sixty per cent. When the Christian religion was preached in our lands, we, the Pallas, Pariahs, Malas, Madigas, etc., embraced Christianity. But others of our stock and origin were not converted and they are known to be the Hindu Depressed classes, being all Hindus or adherants to the Hindus in religion.

In spite, however, of our Christian religion which teaches us fundamental truths the equality of man and man before God, the necessity of charity and love for neighbours and mutual sympathy and forbearance, we, the large number of Depressed class converts remain in the same social condition as the Hindu Depressed Classes. Through the operation of several factors, the more important of them being the strong caste retaining Hindu mentality of the converts to Christianity, and the indifference, powerlessness and apathy of the Missionaries, we remain today what we were before we became Christians—Untouchables—degraded by the laws of social position obtaining in the land, rejected by caste Christians, despised by Caste Hindus and excluded by our own Hindu Depressed Class brethren.

Pariah Christians, Malla Christians and Madiga Christians. They would not intermarry, they would not inter-dine. They are as much caste ridden as the Hindus are. There is another thing which shows that Christianity has not been effective in wiping paganism out of the converts.

Almost all the converts retain the Hindu forms of worship and believe in Hindu superstition. A convert to Christianity will be found to worship his family Gods and also the Hindu gods such as Rama, Krishna, Shankar, Vishnu,etc.

A convert to Christianity will be found to go on a pilgrimage to places which are sacred to the Hindus. He will go to Pandharpur, and make offerings to Vithoba. He will go to Jejuri and sacrifice a goat to the blood-thirsty god, Khandoba. On the Ganesh Chaturthi he will refuse to see the moon, on a day of eclipse he will go to the sea and bathe—superstitions observed by the Hindus. It is notorious that the Christians observe the social practices of the Hindus in the matter of births, deaths and marriages.

I say nothing about the prevalence of the Hindu social practices among the Christians. In as much as these social practices have no religious significance it matters very little what they are. But the same cannot be said of religious observances. They are incompatible with Christian belief and Christian way of life.

మతం మార్చుకున్న వారి స్థితి VOL5 PAGE 570-573


Tuesday, 5 February 2019

Sri Sathya Sai Hospitals & Educational Institutes

1. Speech by PM-Sri Atal Behari Vajpayee 19th Jan 2001-Hospital Inauguration

https://www.youtube.com/watch?v=I4nXbOjZ0VQ

2. On the morning of 22 November 1991, Mr. P. V. Narasimha Rao, the then Prime Minister of India, approached Bhagavan with folded palms and offered Him his pranams. The two walked on the red carpet to the massive and exquisitely carved door at the entrance to the central hall of the building. The Prime Minister cut the ribbon and entered the hall. There, under the grand multi-colored dome, Bhagavan introduced him to the doctors and others who were there to receive him.

https://www.youtube.com/watch?v=peXX3H0Lr8c


3. Prime Minister Narendra Modi at Sri Sathya Sai Sanjeevani International Centre for Child Heart Care & Research in Palwal, Haryana via video conference : 27.11.2016

https://www.youtube.com/watch?v=0bnXR9byFkk

Sachin Tendulkar's visit to Sri Sathya Sai Sanjeevani International Center for Child Heart Care and Research, Palwal, Haryana on August 3, 2017

https://www.youtube.com/watch?v=bqgU_M6z0II

4. Raipur: Sri Sathya Sai Sanjeevani Hospital provides free of cost treatment for Heart Patients

Mr. C Sreenivas

C Sreenivas, M Com M Phil has been associated with Bhagawan Sri Sathya Sai Baba and His various Service Projects in Healthcare, Education, Drinking Water Supply and Rural Service Initiatives for over 40 years. A selfless worker he has built and run several Institutions of Service most notably in recent years the Sri Sathya Sai Sanjeevani Hospitals – Centres for Child Heart Care, wherein all services are provided Totally Free of Cost to all. His Late Mother Dr C Rajeshwari was instrumental in founding the first General Hospital of Sri Sathya Sai Health & Education Trust. He is presently the Chairman of the Trust.

https://www.youtube.com/watch?v=v8lX717wZUI

Prime Minister Sri Narendra Modi inaugurated Sri Sathya Sai Sowbhagyam - Centre for Human Development in Naya Raipur, Chhattisgarh, and also inaugurated a marble statue of Bhagawan Sri Sathya Sai Baba, on Sunday, February 21, 2016, in the august presence of Dr Raman Singh, Chief Minister of Chhattisgarh and Sri Venkaiah Naidu, Union Minister for Urban Development, Housing & Urban Poverty Alleviation and Parliamentary Affairs.

https://www.youtube.com/watch?v=zgYJMUNZbZs

5. The Sri Sathya Sai Sanjeevani International Centre for Child Heart Care & Research, located in Baghola, Delhi – Mathura Road, Palwal (Dist.) Haryana – 121102 , is a 200 bedded Super Specialty Hospital, providing Child Heart care TOTALLY FREE OF COST to all, irrespective of caste, religion, nationality and economic status.

https://srisathyasaisanjeevani.org/about/


6. Sri Sathya Sai Higher Secondary School



7. Sathya Sai Schools integrate educare with traditional curriculum promoting students with good character skilled in academic areas. Sai Baba established the first Sathya Sai School in India in 1968. By the early 1990s Sathya Sai Schools began to be established outside India, and Institutes of Sathya Sai Education (ISSE) were soon established to train teachers and assure quality. There are now 31 Institutes of Sathya Sai Education (ISSEs) in 31 countries, and 37 Sathya Sai Schools around the world.

http://www.sathyasai.org/about-us/education

ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఇచ్చిన షిర్డీ ఆలయ ట్రస్ట్

ముంబై: మహారాష్ట్రలోని ప్రవర నదిపై ఉన్న నీల్‌వాండే డ్యామ్‌ కాలువల నిర్మాణం కోసం షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాలువల నిర్మాణం వల్ల అహ్మద్‌నగర్ జిల్లాతోపాటు నాసిక్‌ సిన్నార్‌లోని సంగమ్‌నెర్, అకోలె, రహత, రాహురి, కోపర్గో తహశీల్‌లలోని 182 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.  ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పిన ఆయన వడ్డీ మాత్రం వసూలు చేయబోమన్నారు. అయితే, ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. సామాజిక కార్యక్రమాల కోసం డబ్బులు వెచ్చించడం ఆలయ ట్రస్ట్‌కు కొత్త కాదని, అయితే, నీల్‌వాండే డ్యామ్ కోసం ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇదే తొలిసారిని, ఇది చాలా అరుదైన ఘటన అని ఆయన వివరించారు.



Hindu Charity TTD

ఐల్లయ్య చేసే ఆరోపణ టిటిడి నిధులు పేద ప్రజలకు ఖరు పెట్టవని. ఇదొక అసత్య ఆరోపణ టిటిడి చేసే చారిటి సంస్థల లిస్త్ ఇస్తున్నాను

Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled 


Sri Venkateswara Poor Home
Sri Venkateswara Bala Mandir 

Sri Venkateswara Institute of Medical Sciences
Sri Venkateswara School for the Deaf
Sri Venkateswara Training Centre for the Handicapped
Conservation of Water and Forests - Haritha Project 

http://www.tirumala.org/SocialActivities.aspx


Education 

Sri Venkateswara Vedic University, Tirumala
Sri Venkateswara Arts College,Tirupati
Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture, Tirupati
Sri Venkateswara College of Music and Dance, Tirupati
Sri Venkateswara Ayurvedic College, Tirupati
Sri Venkateswara Yoga Institute, Tirupati...
Sri Venkateswara Polytechnic for the Physically Challenged (SVPPC), Tirupati
Sri Padmavati Women's Polytechnic College, Tirupati
Sri Venkateswara College, New Delhi

Hospitals 

TTD acts as a major stake holder in the following hospitals[10]
Sri Venkateswara Ramnarain Ruia Government General Hospital
Sri Venkateswara Institute of Medical Sciences
Government Maternity Hospital, Tirupati

https://en.wikipedia.org/wiki/Tirumala_Tirupati_Devasthanams



Telugu & English Writings & Speeches of Dr. Babasaheb Ambedkar

Writings & Speeches of Dr. Babasaheb Ambedkar VOL1-VOL17_2
you can download


డా.బి.ఆర్. అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు
teluguuniversity.ac.in/dr-b-r-ambedkar-writing-speeches/

How British Rulers Deceived Dalits - Dr. B. R. Ambedkar

Dear Mr. Alexander


Allow me to say that the British have a moral responsibility towards the Scheduled Castes. They may have moral responsibilities towards all minorities. But it can never transcend the moral responsibility which rests on them in respect of the Untouchables. It is a pity how few Britishers are aware of it and how fewer are prepared to discharge it. British Rule in India owes its very existence to the help rendered by the Untouchables. Many Britishers think that India was conquered by the Clives, Hastings, Cootes and so on. Nothing can be a greater mistake. India was conquered by an army of Indians and the Indians who formed the army were all Untouchables. British Rule in India would have been impossible if the Untouchables had not helped the British to conquer India. Take the Battle of Plassey which laid the beginning of British Rule or the battle of Kirkee which completed the conquest of India. In both these fateful battles the soldiers who fought frthe British were all Untouchables


 What have the British done to these Untouchables who fought for them ? It is a shameful story. The first thing they did was to stop their recruitment in the army. A more unkind, more ungrateful and more cruel act can hardly be found in history. In shutting out the Untouchables from the Army the British took no note that the Untouchables had helped them to establish their rule and had defended it when it was menaced by a powerful combination of native forces in the Mutiny of 1857. Without any consideration as to its effects upon the Untouchables the British by one stroke of the pen deprived them of their source of livelihood and let them fall to their original depth of degradation. Did the British help them in any way to overcome their social disabilities ? The answer again must be in the negative. The schools, wells and public places were closed to the Untouchables. It was the duty of the British to see the Untouchables, as citizens, were entitled to be admitted to all institutions maintained out of public funds. But the British did nothing of the kind and what is worst, they justified their inaction by saying that untouchability was not their creation. It may be that untouchability was not the creation of the British. But as Government of the day, surely the removal of untouchability was their responsibility. No Government with any sense of the functions and duties of a Government could have avoided it What did the British Government do ? They refused to touch any question which involved any kind of reform of Hindu society. So far as social reform was concerned, the Untouchables found themselves under a Government distinguished in no vital respect from those native Governments under which they had toiled and suffered, lived and died, through all their weary and forgotten history. From a political standpoint, the change was nominal. The despotism of the Hindus continued as ever before. Far from being curbed by the British High Command, it was pampered. From a social point of view, the British accepted the arrangements as they found them and preserved them faithfully in the manner of the Chinese tailor who, when given an old coat as a pattern, produced with pride an exact replica, rents and patches and all. And what is the result ? The result is that though 200 years have elapsed since the establishment of the British Rule in India the Untouchables have remained Untouchables, their wrongs remained unredressed and their progress hampered at every stage. Indeed if the British Rule has achieved anything in India it is to strengthen and reinvigorate Brahmanism which is the inveterate enemy of the Untouchables and which is the parent of all the ills from which the Untouchables have been suffering for ages.


Ref : The letter is reproduced in Dr babasaheb ambedkar writings and speeches volume 10, 

pp 492-499



**************************************

1946 ఆల్బర్ట్ విక్టర్ అలెగ్జాండర్‌కు రాజ్యాంగ రక్షణలు అస్పృశ్యులకు ఎంత అవసరమో వివరిస్తూ అంబేద్కర్‌గారు వ్రాసిన లేఖ.



బ్రిటిష్ ప్రభుత్వం నుండి పాలనాధికారాన్ని భారతీయ నాయకత్వానికి బదిలీచేసే విషయమై చర్చించేందుకు 1946లో క్యాబినెట్ మిషన్ (దౌత్యవర్గం) భారతదేశం వచ్చింది. దాని సభ్యుడైన ఆల్బర్ట్ విక్టర్ అలెగ్జాండర్‌కు రాజ్యాంగ రక్షణలు అస్పృశ్యులకు ఎంత అవసరమో వివరిస్తూ అంబేద్కర్‌గారు వ్రాసిన లేఖ.


ప్రియమైన శ్రీ అలెగ్జాండర్,


కాంగ్రెస్‌కు, లీగ్‌కు మధ్య పరిష్కారం సాధించేందుకు మీరు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం విచారకరం. మీకు సానుభూతి, కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అయితే మిషన్ చేసిన ప్రయత్నాలు నాకో పాత కథను గుర్తుకు తెచ్చాయి. ఒక ముసలి వ్యాపారికి పిల్లలు లేరు. తన ఆస్తికి వారసుడు లేకపోవడంతో ఆయన ఒక యువతిని పెళ్ళి చేసుకున్నాడు. సంతానం కావాలనే ఆశ తీరబోతున్నట్లు తెలిసిందిగానీ ఆ వ్యాపారి ప్రాణాంతకమైన వ్యాధితో మంచమెక్కాడు. కొడుకును చూసేంతవరకు చనిపోకూడదని నిర్ణయించుకున్నాడు. కాని, ఆమె ప్రసవానికి ఇంకా చాలాకాలం పడుతుంది. ఎంత అసహనానికి గురయ్యాడంటే, డాక్టర్‌ను పిలిచి ఆమె కడుపు కోసి, శిశువు ఆడో, మగో చెప్పమని కోరాడు. చివరికి జరిగించేమిటంటే, ఆపరేషన్‌లో తల్లీ బిడ్డా చనిపోయారు. ఆ వ్యాపారి చేసిన పనే ఈ మిషన్ కూడా చేసినట్లనిపిస్తున్నది. మీకు తెలియకపోవచ్చును గాని సహజమైన ఫలన కాలం వరకు ఆగకుండా మీ మిషన్ ఇటువంటి బలవంతపు ప్రసవానికే పాటు పడిందని నాలాగే చాలామంది భావిస్తున్నారు.


ఈనాడు హిందువులకు, ముస్లింలకు ఈ దేశ గమ్యాన్ని నిర్ణయించేందుకు తగిన మానసిక పరిపక్వత లేదనిపిస్తున్నది. హిందువులు, ముస్లింలు కేవలం గుంపులు మాత్రమే. కంటికి కనిపించే ప్రయోజనం కంటే అందరూ పంచుకునే అనుభూతి వైపే గుంపులు మొగ్గు చూపుతాయనే సంగతి మీ అనుభవంలో తెలుసుకునే ఉంటారు. ఒక గుంపును తాపీగా ప్రయోజనాల గురించి అంచనా వేసుకోవలసిందిగా సూచించడం కంటే, సామూహిక త్యాగం చేయవససిందిగా నచ్చ చెప్పడం ఎంతో సులభం. లాభనష్టాల వివక్షను సమూహం ఎప్పుడూ కోల్పోతుంది. ఉన్నతమైన కారణాలకో, అల్పమైన కారణాలకో, సుఖాలకో, కష్టాలకో, దయకో, క్రూరత్వానికో గుంపు ఎటువైపైనా కదులుతుంది. అది హేతువుకు అందదు. సామూహిక ఉద్రేకంలో వ్యక్తిగత వివేచనా బుద్ధి నశిస్తుంది. ఉదారపూర్వకమైన ఒక విషయాన్ని అంగీకరించవలసిందిగా కోరడం కంటే ఒక సమూహాన్ని ఆత్మహత్యకు పాల్పడవలసిందిగా చెప్పడం చాలా సులభం. మీరు ఎలా కొనసాగాలో నేను చెప్పాల్సిన పని లేదు. భంగీ బస్తీలోను, 10, ఔరంగజేబ్ రోడ్‌లోను మిషన్ వారికి గొప్ప తెలివితేటలు, సమున్నత స్పూర్తి కనిపించాయి. ఆ తెలివి తేటలను, స్పూర్తిని గేలిచేసే వారిలో నేను చివరి వాడిని. మిషన్ కంగారులో ఒక వృద్ధుని దయనీయతను ప్రదర్శించ కూడదా అని నేను అనుకుంటునాను. ఐరిష్ హోం రూల్ ప్రచారోద్యమంలో పాల్గొన్న గ్లాడ్ స్టోన్‌ని వర్ణించడానికి చాంబర్‌లైన్ శీతల కాలం (కూలింగ్ పీరియడ్) అని ఒక పదబంధం ఉపయోగించాడు. అట్లాగే వీళ్ళిప్పుడు సునాయాస మార్గంలో ఉన్నారు.


ఇదంతా మిషన్‌కు ప్రధాన పార్టీలకు, ఆప్రధాన పార్టీలలో నమ్మకం ఉన్న వారికి సంబంధించిన సంగతి. రాజ్యాంగ రక్షణలు కల్పించాలన్న అస్పృశ్యుల డిమాండ్ పట్ల వారి సమస్యల పట్ల మీరు ఎలా వ్యవహరించాలనుకుంటున్నారో తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. సింలా చర్చల ఆఖరి రోజున మిషన్ జారీ చేసిన ప్రకటనలో కొద్ది రోజులలోనే తాము ఢిల్లీకి తిరిగి రాగానే తదుపరి చర్యల ప్రతిపాదనలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. సహజంగానే షెడ్యూల్డ్ కులాల వారు దృష్టి ఈ ప్రకటన వైపు మళ్ళింది. మిషన్ నిర్ణయం వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మిషన్ నిర్ణయాలు అస్పృశ్యుల సుఖమయ స్వేచ్చా జీవితాలకు తలుపులు తెరవనూవచ్చు లేదా వారి ఆశలను సమాధి చేయనూ వచ్చు. ఇది అస్పృశ్యుల జీవన్మరణ సమస్య గనుక ఆ సమస్య గురించి కొద్ది నిముషాలు మీ సమయాన్ని తీసుకోవటం అనుచితం కాబోదు.


అస్పృశ్యుల సమస్య వారు తట్టుకోలేనంత పెద్ద సమస్య. అయితే, దిగువ చెప్పిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకుంటే వాటిని అర్ధం చేసుకోవడం ఎంతో సులభం. ఈ అస్పృశ్యుల చుట్టూ పెద్ద సంఖ్యలో హిందువులు ఆవరించి ఉన్నారు. వీరు అస్పృశ్యుల పట్ల నిర్దయగా వ్యవహరించడమే గాక అక్రమాలు, అత్యాచారాలు జరిపేందుకు కూడా సిగ్గుపడరు. నిత్యం సర్వసాధారణమైపోయిన ఇటువంటి విషయాల గురించి రక్షణ కోసం పాలక వర్గానికి ఫిర్యాదు చేయాలి. కాని పాలక వర్గం స్వభావ స్వరూపాలు ఎలాంటివి? క్లుప్తంగా చెప్పాలంటే భారత దేశంలో పరిపాలన అంతా హిందువుల చేతుల్లోనే ఉంది. అది వారి గుత్తాధిపత్యం. పై నుంచి కింది దాకా వారిదే నియంత్రణ. వారు ఆధిపత్యం వహించని శాఖంటూ లేదు. పోలీసు శాఖ, న్యాయ శాఖ, రెవెన్యూ సర్వీసులు...ఇదీ అదీ అని కాదు, పాలన సంబంధమైన ప్రతి శాఖలోనూ ఇదే పరిస్థితి. ఇక గుర్తుంచుకోవలసిన రిండో ముఖ్యమైన అంశం ఏమిటంటే పాలకులుగా ఉన్న హిందువులను కేవలం అసాంఘిక శక్తులుగా మాత్రమే చెప్పడానికి వీల్లేదు. వారు సంఘ వ్యతిరేకులు, అస్పృశ్యులకు శత్రువులు. అస్పృశ్యుల పట్ల వివక్ష చూపడం, వారికి చట్టం ప్రయోజనాలు అందకుండా చేయడం మాత్రమే కాదు, అణచివేత నుంచి చట్టం వారికి కల్పించే రక్షణను దూరం చేయడం కూడా వారి ప్రధాన లక్ష్యం. ఫలితంగా, హిందూ ప్రజలకూ, హిందువులతో నిండిన అధికార వర్గానికీ మధ్య అస్పృశ్యులు నలిగి పోయారు. ఒకవైపు హిందువులు అత్యాచారాలకు, అక్రమాలకు పాల్పడుతూ ఉంటే ఈ అధికార వర్గం వారు బాధితులైన అస్పృశ్యులకు రక్షణ కల్పించడానికి బదులు హిందువులనే కాపాడుతున్నారు.


ఈ నేపథ్యంలో అస్పృశ్యులపరంగా కాంగ్రెస్ తరహా స్వరాజ్యం అంటే అర్థం ఏమిటి? ఈ రోజు పాలనోద్యోగాలు మాత్రమే హిందువుల చేతుల్లో ఉన్నాయి. స్వరాజ్యం వస్తే విధాన/ శాసనసభలు, కార్యనిర్వాహక మండలులు కూడా హిందువులతో నిండిపోతాయి అని అర్థం. స్వరాజ్యం అస్పృశ్యుల బాధలను మరింత పెంచుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతికూల పాలనకు అదనంగా వారు ప్రతికూల విధాన/ శాసనసభలనూ మొద్దుబారిన కార్యనిర్వాహక మండలినీ అస్పృశ్యుల పట్ల అన్యాయ ప్రవర్తనను నియంత్రించలేని అధికార వర్గాన్నీ, పగ్గాలు వేయలేని విషపూరిత ప్రవర్తననూ చవిచూడవలసి వస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే హిందువులు, హిందూయిజమూ తమకు ఏర్పరచిన ఈ నీచ జీవనస్థితి నుంచి తప్పించుకోవటానికి అస్పృశ్యులకు కాంగ్రెస్ తరహా స్వరాజ్యంలో మరో మార్గమే ఉండదు.


పై సమాచారాన్ని బట్టి ఈ రకమైన స్వరాజ్యాన్ని అస్పృశ్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఈ స్వరాజ్యం అస్పృశ్యుల పాలిట దుర్ఘటనగా మారకుండా ఉండాలంటే చట్టసభలో తమకు తగిన ప్రాతినిధ్యం ఉండాలనీ, తద్వారా హిందువులు తమకు చేసే అన్యాయాలను, తమ పట్ల చేసే తప్పిదాలను ఎదుర్కోవటం సాధ్యమవుతుందనీ అస్పృశ్యులు భావిస్తున్నారు.


కార్యనిర్వాహక వర్గంలో ప్రాతినిధ్యం ఉండడం ద్వారా తమ సమున్నతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికీ అధికారులలో తమ ప్రతినిధులు ఉండడం ద్వారా పాలనాయంత్రాంగం పూర్తిగా తమ పట్ల శత్రుత్వం వహించకుండా చూడడానికీ వీలవుతుంది. ప్రాతినిధ్యం విషయంలో అస్పృశ్యులు పట్టుపట్టటానికి కారణాలు ఇవి. రాజ్యాంగ రక్షణల కోసం అస్పృశ్యులు చేస్తున్న డిమాండ్‌లో న్యాయాన్ని మీరు గమనించగలిగితే వారు ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకు కోరుకుంటున్నారో కూడా అర్ధమవుతుంది. చట్టసభలో అస్పృశ్యులు మైనార్టీలవుతారు. వారు ఎప్పటికీ మైనార్టీలుగానే ఉండిపోతారు. వర్గపరమైన మెజారిటీ స్థిరంగానే ఉండిపోతుంది గనుక వీరు దానిని అధిగమించే అవకాశమే లేదు. వాళ్ళు చేయగలిగిందల్లా ఒక్కటే - మెజారిటీ వర్గం వారు నిర్దేశించిన నియమాలను బలవంతంగా అంగీకరించడం కాకుండా, మెజారిటీతో కలిసి మెలిగేందుకు షరతులను నిర్ణయించుకుంటారు. ఇంకొకటేమిటంటే, మెజారిటీ వర్గం, కలిసి పనిచేయడానికి తిరస్కరించినా తప్పులను సరిదిద్దుకోవటానికి ఒప్పుకోకపోయినా కనీసం చట్టసభలో వీరు తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆవిధంగా నిరసన తెలిపే స్వాతంత్ర్యాన్ని అస్పృశ్యులు ఎప్పుడు ఎలా ఉపయోగించుకోగలరు? అస్పృశ్యుల ప్రతినిధులు మెజారిటీ వర్గపు ఓట్లపై ఆధారపడకుండా చట్టసభలకు ఎన్నికైనప్పుడు మాత్రమే ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్న డిమాండ్‌కు ఇదే ప్రాతిపదిక.


అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలు లేనిపక్షంలో ఎలాంటి రక్షణనైనా సరే అవి అస్పృశ్యులకు ఉపయోగపడవు. ప్రత్యేక నియోజకవర్గమే ఈ విషయంలో అత్యంత కీలకమైనది. 1946 ఏప్రిల్ 9న క్యాబినెట్ మిషన్ ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు కాంగ్రెస్ హరిజనులు క్యాబినెట్ మిషన్‌కు సమర్పించిన వినతిపత్రం ప్రతి నా దగ్గర ఉంది. టూలీవీధిలోని ముగ్గురు దర్జీలు పార్లమెంటునుద్దేశించి "ఇంగ్లండు ప్రజలమైన మేము" అని సాహసం ప్రదర్శించినట్టే ఉంది వీరి విషయమూ. పైగా షెడ్యూల్డు కులాల సమాఖ్య తరపున నేను చేసిన డిమాండ్లకూ, వీరు చెప్పిన దానికీ తేడా ఏమీలేదు. ప్రత్యేక నియోజకవర్గాల విషయం మాత్రమే భేదం. కాంగ్రెస్ హరిజనుల డిమాండ్లను మీరు ఎలా అర్ధం చేసుకుంటారో నాకు తెలియదు. నిజానికి అవి డిమాండ్లు కావు. అవి కేవలం రాజకీయ రక్షణ రూపంలో అస్పృశ్యులకు కాంగ్రెస్ ఇవ్వజూపుతున్నవి మాత్రమే. ఇది నాకు అర్ధమైన సంగతి కాదు - ఇది నాకు తెలిసిన విషయం. ఎందుకంటే, ఉమ్మడి నియోజకవర్గలను నేను అంగీకరించే పక్షంలో కాంగ్రెస్‌వారు నా ఇతర కోరికలన్నిటినీ అంగీకరిస్తారని కాంగ్రెస్ గురించి తెలిసిన వారు నాకు చెప్పారు. కాంగ్రెస్ వారు షెడ్యూల్డు కులాల వారి అన్ని కోరికలూ తీర్చటానికి సిద్దమై ప్రత్యేక నియోజకవర్గాలకే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బహుశా మీరు ఆశ్చర్యపడుతున్నారేమో! కాంగ్రెస్ ఎలాంటి నాటకం ఆడుతున్నదో తెలిస్తే అందులో ఆశ్చర్యమేమీ కనిపించదు. ఆ ఆట చాలా లోతైనది. అస్పృశ్యులకు కొన్ని రక్షణలు కల్పించి తీరాల్సిన పరిస్థితి ఉన్నట్లు కాంగ్రెస్ గమనించడం వల్ల ఇప్పుడు దాని ప్రభావం లేకుండా చూడాలంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నది. ఉమ్మడి నియోజకవర్గాల విధానంలో మాత్రమే ఈ రక్షణల ప్రభావం లేకుండా చేయవచ్చునని భావిస్తున్నది.అందుకే ఉమ్మడి నియోజకవర్గాల కోసం కాంగ్రెస్ పట్టుబడుతున్నది. అప్పుడు అస్పృశ్యులకు అధికారం లేని హోదా ఇవ్వవచ్చు. అస్పృశ్యులు కోరుకుంటున్నది అధికారంతో కూడిన హోదా. ఇది కేవలం ప్రత్యేక నియోజకవర్గాల వలన మాత్రమే సాధ్యమవుతుంది గనుక అందుకోసమే పట్టుబట్టారు.


షెడ్యూల్డ్ కులాలు పోతపోసిన పెట్టె లాంటివి గనుక వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలనే వాదనలో నాకు నమ్మకముంది. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలూ దానిని ఆమోదిస్తున్నాయి. ప్రత్యేక నియోజకవర్గాల వాదనను సమర్ధిస్తూ 1946 మే 3 న లార్డ్ వావెల్‌కు నేనొక లేఖ రాశాను. బహుశా ఆయన దానిని మీకు చూపించే ఉంటారు గనుక నేనిక్కడ తిరిగి ప్రస్తావించడం అనవసరం. ఇక్కడ ప్రశ్నేమిటంటే, షెడ్యూల్డు కులాల వారు చేస్తున్న ఈ డిమాండుకు మిషన్ ఏం చేయబోతున్నది? హిందువుల రాజకీయపు కావిడి మోసే భారాన్నుంచి అస్పృశ్యులను తప్పించబోతున్నదా? లేక కాంగ్రెస్‌నూ అది ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ మెజారిటీని మిత్రులుగా మార్చుకునేందు కోసం ఉమ్మడి నియోజకవర్గాలు సమర్ధించి వారిని తోడేళ్ళకు వేయబోతున్నదా? బ్రిటిష్‌వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలోగా స్వరాజ్యం అనేది షెడ్యూల్డు కులాల వారికి ఉక్కిరిబిక్కిరి సమస్యగా మారకుండా నిర్ధారించవలసిందిగా ఏలినవారి ప్రభుత్వాన్ని కోరే హక్కు షెడ్యూల్డు కులాలవారికి ఉంది.


షెడ్యూల్డు కులాల వారి పట్ల బ్రిటిష్ వారికి నైతిక బాధ్యత ఉన్నదనే విషయం చెప్పనివ్వండి. వాళ్ళకు మైనారిటీలు అందరిపట్లా బాధ్యత ఉండవచ్చు. కానీ అస్పృశ్యుల విషయంలో తమకున్న నైతిక బాధ్యతను అంత సులభంగా ప్రక్కన పెట్టలేరు. ఆ సంగతి కొద్దిమంది బ్రిటిష్ వారికి మాత్రమే తెలియడం అతి కొద్ది మంది మాత్రమే ఆ బాధ్యత నెరవేర్చడం దురదృష్టకరం. భారతదేశంలో బ్రిటిష్ పాలన అస్తిత్వానికే అస్పృశ్యులు చేసిన సేవలు మరువరానివి. భారతదేశాన్ని గెలిచింది క్లైవులు, హేస్టింగులూ, కూట్లూ అనే భావం చాలామంది బ్రిటిష్‌వారిలో ఉంది. అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. భారతదేశాన్ని వారు భారతీయ సైన్యంతోనే గెలిచారు. ఆ భారతీయ సైన్యంలోని వారంతా అస్పృశ్యులు. భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి అస్పృశ్యులు సహాయపడి ఉండకపోతే భారతదేశంలో బ్రిటిష్ పాలన సాధ్యమయ్యేది కారు. బ్రిటిష్ పాలన ఆరంభానికి కారణమైన ప్లాసీ యుద్దం తీసుకోండి, లేదా భారత ఆక్రమణ పూర్తి చేసిన కిర్కీ యుద్దం తీసుకోండి. ఈ రెండు దురదృష్టకరమైన యుద్దాలలోను బ్రిటిష్‌వారి కోసం పోరాడిన సైనికులంతా అస్పృశ్యులే!


తమకోసం పోరాడిన అస్పృశ్యులకోసం బ్రిటిష్‌వారు ఏం చేశారు? అదంతా చెప్పుకుంటే సిగ్గుచేటు. అస్పృశ్యులను సైన్యంలో చేర్చుకోవడాన్ని నిలిపి వేయడం మొదటి చర్య. ఇంత నిర్దయగా, ఇంత క్రూరంగా, ఇంత కృతఘ్నంగా వ్యవహరంచిన ఉదంతం బహుశా చరిత్రలో మరెక్కడా ఉండదు. 1857 తిరుగుబాటులో బలవంతులైన సంస్థానాధీశులంతా ఏకమై తమతో పోరాడినపుడు తమతోపాటు ఉండి తమను రక్షించిన అస్పృశ్యులను ఏమాత్రం గుర్తుంచుకోకుండా వారిని ఇప్పుడు సైన్యం నుండి తొలగించడం బ్రిటిష్‌వారికి చీమకుట్టినట్లయినా అనిపించడం లేదు. దీని ప్రభావం అస్పృశ్యుల మీద ఎలా ఉంటుందో కూడా గమనించకుండా, ఒక్క కలంపోటుతో వారి జీవనాధారాన్ని పోగొట్టి వారిని పూర్వపు అధోగతిలో పడవేశారు. సామాజిక అసహయతల నుండి బైట పడేందుకు వారికి బ్రిటిష్‌వారు సహాయం చేశారా? దీనికి కూడా లేదనే సమాధానం వస్తుంది. పాఠశాలలు, బావులు, మొదలైన సామాన్య ప్రదేశాలకు అస్పృశ్యులు రాకూడదు. దేశ పౌరులుగా, ప్రభుత్వ నిధులతో నిర్వహించే అన్ని సంస్థలకు అస్పృశ్యులు అర్హులేనని చెప్పి ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత బ్రిటిష్ వారిది. కానీ బ్రిటిష్‌వారు అలాంటిదేమీ చేయలేదు. పైగా "అస్పృశ్యత"ను సృష్టించింది తాము కాదంటూ తమ నిష్క్రియా పరత్వాన్ని సమర్ధించుకున్నారు. అస్పృశ్యతను బ్రిటిష్‌వారు సృష్టించకపోవచ్చుగాక. కానీ, అప్పటి సాధారణ పాలకులుగా దేశంలోని అస్పృశ్యతను తొలగించడం వారి బాధ్యత. ప్రభుత్వ విధులు, బాధ్యతలు గుర్తెరిగిన ఏ ప్రభుత్వమూ ఆ విధంగా బాధ్యతను విస్మరించదు. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? హిందూ సమాజాన్ని సంస్కరించే ఏ అంశాన్నీ ముట్టుకునేందుకు అంగీకరించలేదు. సమాజ సంస్కరణ వరకు ఆలోచిస్తే తరతరాలుగా కష్టాలతో, అవమానాలతో, బాధలతో జీవచ్చవాలుగా తాము కాలం గడిపినప్పటి స్వదేశీ రాజుల కాలానికీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని అస్పృశ్యులు తెలుసుకున్నారు. పాలనపరంగా మార్పు నామ మాత్రమే. హిందువుల నిరంకుశత్వ అధికారం పూర్వంలాగానే కొనసాగుతున్నది. దానిని తగ్గించడానికి బదులు బ్రిటిష్ అధిష్టానం మరింత ప్రేమతో పోషిస్తున్నది. సామాజికపరంగా బ్రిటిష్‌వారు అప్పటివరకూ ఉన్న విధానాలనే అంగీకరిస్తూ, వాటినే కాపాడుతూ వచ్చారు. వెనకటికి చైనాలో ఒక దర్జీకి కోటు కుట్టమని కొత్త బట్ట, మాదిరి కోసం పాత కోటు ఇస్తే, కొత్త కోటును అతుకులు, చిరుగులతో సరిగ్గా పాత కోటులాగానే సగర్వంగా కుట్టి ఇచ్చాడట. అలా తయారైంది పరిస్థితి. రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా బ్రిటిష్ వారి పాలనలో అస్పృశ్యులు అస్పృశ్యులుగానే మిగిలిపోయారు. వారి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ప్రతి దశలోనూ వారి అభ్యున్నతికి అడ్డుపుల్లలు పడుతూనే ఉన్నాయి. నిజానికి బ్రిటిష్ పాలన భారతదేశంలో సాధించిందంటూ ఉంటే, అది బ్రాహ్మణత్వాన్ని బలోపేతం చేయడమే. ఈ బ్రాహ్మణత్వమే అస్పృశ్యులకు అనాదిగా శత్రువు. అస్పృశ్యులు తరతరాలుగా పడుతున్న బాధలకు మూలం ఇదే.


"బ్రిటిష్ వారు రాజ్యాధికారం వదులుకొని వెళ్ళిపోతున్నారని ప్రకటించేందుకు మీరిక్కడకు వచ్చారు", ఈ అధికారము, బలమూ ఎవరికి దత్తం చేసి వెళుతున్నారు? (భారతీయులకు) అంటే అస్పృశ్యులను అణచివేసిన వారికా? అని ఒక అస్పృశ్యుడు అడగటంలో తప్పులేదు, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆవిధంగా ముగించడం ఇతర పార్టీల వారికి ఆక్షేపణీయం కాకపోవచ్చు. కానీ బ్రిటిష్ లేబర్ పార్టీ మాటేమిటి? సమాజంలో చిన్న చూపునకు గురైనవారికి, అట్టడుగు వర్గాలకు లేబర్ పార్టీ చేయూతనిచ్చి నిలబడుతోంది. ఆ మాట నిజంగా నిజమైతే, భారతదేశంలోని అరవై మిలియన్ల అస్పృశ్యుల వైపున ఆ పార్టీ నిలబడి వారి పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపడుతుందని నాకు నమ్మకం ఉంది. అస్పృశ్యులకు శత్రువులుగా ఉంటూ తమ మత తత్వధోరణుల దృష్ట్యా పరిపాలనకు అనర్హులైన వారి చేతుల్లోకి, అస్పృశ్యులకు శత్రువులైన వారి చేతుల్లోకి అధికారం వెళ్ళకుండా చూస్తుంది. షెడ్యూల్డు కులాల ట్రస్టీలమని చెప్పుకునే బ్రిటిష్‌వారు నిర్లక్ష్య ధోరణికి అదొక పరిహారం మాత్రం కాగలదు.


అస్పృశ్యులు అడుగుతున్న రాజ్యాంగ రక్షణల విషయంలో క్యాబినెట్ దౌత్యవర్గం వారు మౌనం వహించటం వల్ల కలిగిన ఆతృతతోనే నా ఆవేదన ఇంతగా వెళ్ళగక్కాల్సి వచ్చింది. అస్పృశ్యులకు దౌత్యవర్గం, మైనార్టీలకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఈ ఆందోళనను మరింత పెంచాయి. ఈ వాగ్దానాలకు సంబంధించి దౌత్యవర్గం వైఖరి చూస్తుంటే లార్డ్ పామర్‌స్టన్ మాటలు గుర్తుకొస్తున్నాయి. "మాకు శాశ్వత శత్రువులెవరూ లేరు. మాకు శాశ్వత మిత్రులెవరూ లేరు, మాకు శాశ్వత ప్రయోజనం మాత్రమే ఉంది" అన్నారాయన. దౌత్యవర్గం పామర్‌స్టన్ సామెతనే మార్గదర్శకంగా స్వీకరిస్తున్నదనే అభిప్రాయం కలిగితే అస్పృశ్యులకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో మీరు అర్ధం చేసుకోవచ్చు. గ్రేట్ బ్రిటన్‌లో మీరు ఒక అట్టడుగు వర్గం నుండి వచ్చారు. భారతదేశంలోని ఆరుకోట్ల అట్టడుగు వర్గాలవారు మోసపోయే అవకాశం లేకుండా వారికి మీరు చేయగలిగినంత సాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకముంది. అందుకే వారి సమస్యను మీ ముందుంచాలని ఆలోచించాను. విషయం చెప్పనివ్వండి. ఒక్క విషయం దౌత్యవర్గంలో (మిషన్‌లో) మిమ్మల్ని మించిన మిత్రులెవరూ తమకు లేరని అస్పృశ్యులు అభిప్రాయపడుతున్నారు.


భవదీయుడు

బి.ఆర్. అంబేద్కర్